Akkineni family టాలీవుడ్ లో ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగిన చాలా మంది హీరోలు, హీరోయిన్లు నేడు పెళ్లిళ్లు చేసుకొని తమ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్తున్నారు. కానీ పాపం అక్కినేని కుటుంబం లో మాత్రం అందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. ముందుగా సుమంత్ గురించి మాట్లాడుకోవాలి. అప్పట్లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమాయణం నడిపి, ఆమెని పెళ్లి చేసుకున్న సమంత కొంతకాలానికే విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన రెండవ పెళ్లి చేసుకోలేదు. ఇక సుమంత్ సోదరి సుప్రియ కి కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈమె పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.
అప్పట్లో ఈమె ‘ఇష్టం’ మూవీ హీరో చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతనితో కొంతకాలానికే విడిపోయింది. విడిపోయిన తర్వాత చరణ్ కొన్నాళ్ళకు గుండెపోటు వచ్చి చనిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత సుప్రియ ఇప్పటి వరకు మరో పెళ్లి చేసుకోలేదు, అన్నపూర్ణ స్టూడియోస్ ని మైంటైన్ చేస్తూ, సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీ గా తన జీవితాన్ని గడుపుతుంది. ఇక నాగ చైతన్య గురించి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత తో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న ఈయన నాలుగేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ఇక అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని, మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుండగా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా అక్కినేని కుటుంబం మొత్తం బ్యాచిలర్స్ గా మిగిలిపోయారు. అయితే నాగార్జున ఇద్దరు కొడుకులకు ఇదే ఏడాది పెళ్లి చెయ్యాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సుప్రియ కూడా ఈ ఏడాదిలోనే పెళ్ళికి సిద్ధం అవ్వబోతున్నట్టు టాక్. సుప్రియ ప్రముఖ నటుడు అడవి శేష్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చాలా కాలం నుండి వార్తలు వినిపిస్తున్నాయి , అలాగే నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమాయణం నడుపుతున్న విషయం ఓపెన్ సీక్రెట్. మరి వీళ్లంతా ఈ ఏడాది సోషల్ మీడియా లో ఇన్ని రోజులు ప్రచారం అవుతున్న వ్యక్తులనే పెళ్లాడబోతున్నారా, లేదా ఇండస్ట్రీ కి సంబంధం లేని వారిని పెళ్లాడబోతున్నారా అనేది చూడాలి.