Rithu Chowdary : హైపర్ ఆది ని తట్టుకోలేకనే ఆ షో చెయ్యడం మానేసాను : రీతూ చౌదరి

- Advertisement -
Rithu Chowdary సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లాండ్ హాట్ బ్యూటీస్ లో ఒకరు రైతు చౌదరీ. ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనకి సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లలో టెంపరేచర్ ని పెంచేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా లో పాపులర్ అయ్యే ముందు ఈమె టీవీ సీరియల్స్ లో విలన్ గా బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ‘గోరింటాకు’, ‘మిస్టర్ పెళ్లి కొడుకు’, ‘కుటుంబ సభ్యులు’, ‘సూర్య వంశం’, ‘ఇంటి గుట్టు’ వంటి సీరియల్స్ లో ఈమె లేడీ విలన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె ‘కేరింత’, ‘సరైనోడు’, ‘రామ్ లీల’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

TV actress Rithu Chowdary Photo Gallery

కేవలం టీవీ సీరియల్స్, సినిమాలు మాత్రమే కాదు, ఈమె బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా రెగ్యులర్ గా పాల్గొంటూ ఉండేది. దశాబ్ద కాలం పైగా ఈటీవీ లో ఆడియన్స్ ని అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షో లో ఈమె హైపర్ ఆది టీం లో ఎక్కువగా చేస్తూ వచ్చేది. కానీ ఈమధ్య కాలం లో ఈమె జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్త్ షో ని మానేయడం వెనుక కారణం చెప్తూ ‘నాకు జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ రావడానికి ముఖ్య కారణం హైపర్ ఆది. అతని వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అలాంటి హైపర్ ఆది ఆ షో మానేసేలోపు నాకు మళ్ళీ ఆ షో కి వెళ్లాలని అనిపించలేదు’.

Rithu Chowdary: విప్పి చూపించడమే పనిగా పెట్టుకున్నావా.. మరీ ఇంతగానా.. ? - NTV Telugu

- Advertisement -

‘హైపర్ ఆది లేకుండా ఒకటి రెండు ఎపిసోడ్స్ చేశాను కానీ, ఆది ఉన్నప్పుడు డైలాగ్స్ విషయం లో, టైమింగ్ విషయం లో నాకు సహాయం చేసేవాడు. ఈరోజు నాకు అలా చేసేవాడు లేక తట్టుకోలేక ఆ షో వదిలేసి వచ్చాను. ఇప్పుడు నాకు వేరే ఎంటర్టైన్మెంట్ షోస్ లో అవకాశాలు బాగా వస్తున్నాయి. సినిమాల్లో కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి కానీ, నన్ను దర్శకులు ఎక్కువ బోల్డ్ తరహా క్యారెక్టర్స్ కి అడుగుతున్నారు. బయట బోల్డ్ గానే ఉంటావు, బోల్డ్ గానే మాట్లాడతావు, సినిమాల్లో అలా చెయ్యడానికి ఏమైంది నీకు అనేవారు, కానీ నాకు నచ్చక చెయ్యడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరీ. ఇకపోతే ఈమె ప్రస్తుతం ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం అయ్యే కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. అంతే కాకుండా త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమె ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Rithu Chowdary: రచ్చ రేపుతోన్న రీతూ చౌదరి.. బీచ్‌లో బీభత్సం సృష్టిస్తుందిగా.. - Telugu News | Jabardasth Fame Rithu Chowdary Glamour Photos goes viral | TV9 Telugu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here