OTT Movies Review : ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే జానర్స్ లో ఒకటి హారర్. థియేటర్ లో ఏదైనా హారర్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే, ఒక కమర్షియల్ సినిమా కి వచ్చే వసూళ్లకంటే అధిక వసూళ్లు వస్తుంటాయి. కానీ ఈమధ్య హారర్ థ్రిల్లర్స్ బాగా రొటీన్ అయిపోయాయి. మధ్యలో కామెడీ హారర్ అంటూ సరికొత్త జానర్ రావడం, అవే తరహా సినిమాలు వస్తుండడం మన తెలుగు లో చూసి చూసి విసుగొచ్చేసింది. సరైన హారర్ థ్రిల్లర్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఇప్పటి వరకు అలాంటి సినిమా అయితే ఈమధ్య కాలం లో రాలేదు కానీ, ఓటీటీ లో ఈమధ్యనే విడుదలైన ‘స్మైల్’ అనే ఇంగ్లీష్ హారర్ చిత్రం మాత్రం అద్భుతమైన థ్రిల్లింగ్ అనునుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమాని చూసినప్పుడు హారర్ మూవీ లవర్స్ కి ఇది కదా హారర్ సినిమా అంటే అని అనిపిస్తుంది.
ఇక మాములు ఆడియన్స్ కి మాత్రం ఇదేమి సినిమా రా బాబు, సినిమా చూస్తున్నప్పుడు గుండెలు ఆగి చనిపోతే ఎవరిదీ బాధ్యత అని అనిపిస్తుంది. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి కాదు, ఈ సినిమా ఆ స్థాయికి తగినదే. క్రింద పోస్టర్లు చూస్తున్నారు గా, ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందో చూసారా?, కేవలం ఆ నవ్వు చూస్తేనే వణుకు వచ్చేస్తాది. కథ ఏంటంటే ఒక వింత ఆకారం లో ఉన్న దెయ్యం వికారమైన నవ్వుతో ఒక మనిషిని చూస్తే, ఆ మనిషి కూడా నవ్వుతూ తనకి తానూ ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీ ని ఛేదించడానికి వచ్చిన ఒక డాక్టర్ చివరికి చెందించిందా లేదా అనేది స్టోరీ. సినిమా క్లైమాక్స్ వరకు సీట్స్ లో కూర్చున్న మీరు ఎన్నోసార్లు ఉలిక్కిపడాల్సిన పరిస్థితులు వస్తాయి.
ఆ స్థాయి హారర్ థ్రిల్లింగ్ మూమెంట్స్ లెక్క లేనన్ని ఉంటాయి. హారర్ సినిమాలను ఇష్టపడే వారు కూడా ఈ సినిమాని రాత్రులు చూసే సాహసం చెయ్యకండి. ఆ రాత్రి మొత్తం నిద్రపోలేరు. ఇక మామూలు ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని చూడాలనుకుంటే ఒంటరిగా చూడకండి. అసలు హారర్ సినిమాలంటేనే భయం, మాకు బీపీ ఉంది, గుండెపోటు రావొచ్చు అని అనుకునే వారు మాత్రం ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు కానీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా వెంటనే చూసేయండి.