ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలు, రీల్స్ ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈమెకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా ఈమె గురించి ఒక పుకారు తెగ షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె ప్రముఖ గుజరాతీ నిర్మాత, యానిమేషన్ డైరెక్టర్ అయిన చిరంజీవి మక్వానా తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి మక్వానా గతం లో ప్రముఖ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా తో ప్రేమాయణం నడిపి, ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరి పెళ్లి పీటలవరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు అతనితోనే అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తుంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ ఈ వ్యవహారం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుపమ పరమేశ్వరన్ కి ఇలాంటి రూమర్స్ కొత్తేమి కాదు. గతం లో హీరో రామ్ పోతినేని తో, అలాగే ప్రముఖ క్రికెటర్ బుమ్రా తో ఈమె డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు నిజమో కాదో అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఇప్పుడు లేటెస్ట్ ఈ గాసిప్ కూడా అదే కోవకి చెందనుందా?, లేదా ఇది నిజామా అబద్దమా అనేది అనుపమ క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.