Ranbir Kapoor ‘ఎనిమల్’ లాంటి సినిమా ఇక జీవితం లో చెయ్యను : రణబీర్ కపూర్

- Advertisement -
Ranbir Kapoor ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ‘ఎనిమల్’ చిత్రం ఒక చరిత్ర. మన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ‘ఏ’ రేటింగ్ ఇచ్చినా కూడా 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే అదే సమయం లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఈ చిత్రం పై పెదవి విరిచారు. రణబీర్ కపూర్ ని ఇండస్ట్రీ లో అభిమానించే అనేక మంది ఇలాంటి సినిమాలు చెయ్యకు అని రణబీర్ ని వారించారట.
Ranbir Kapoor
Ranbir Kapoor

అలా సలహా ఇచ్చిన వారికి రణబీర్ సమాధానం గా చెప్తూ ‘దయచేసి నన్ను క్షమించండి.ఇక మీదట అలాంటి సినిమాలు చెయ్యను’ అని చెప్తున్నాడట. అయితే ఆయన కేవలం ఆ సమాధానం వారిని సంతృప్తి పరిచేందుకు, మొహమాటంతో చెప్పాడట. కానీ ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ఎనిమల్ లాంటి చిత్రాలు కొంతమంది ప్రముఖులకు నచ్చి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా సాధారణ ఆడియన్స్ కి బాగా నచ్చింది. వాళ్ళు నాకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించారు. అందరు నన్ను కాబొయ్యే సూపర్ స్టార్ అని అంటూ ఉంటారు. ఇంకా నన్ను ఎన్ని రోజులు అలా అనిపించుకోమంటారు?, సూపర్ అయ్యే దిశగా అడుగులు వెయ్యాలి కదా. ఇప్పటి వరకు నేను గుడ్ బాయ్, లవర్ బాయ్ సినిమాలే చేస్తూ వచ్చాను. కానీ ఎనిమల్ చిత్రం నా ఇమేజిని మార్చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.

ANIMAL' REVIEW | 1 December, 2023 – Film Information

ఇకపోతే త్వరలోనే ఆయన ‘ఎనిమల్’ సీక్వెల్ ‘ఎనిమల్ పార్క్’ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం తో పాటుగా ఆయన బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న రామాయణం లో కూడా నటించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరిగింది. ఈ చిత్రం లో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణాసురిడిగా కేజీఎఫ్ యాష్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు.

- Advertisement -

Ranbir Kapoor: 'Sanju' was an opportunity to play my icon on screen

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here