Vikramarkudu Re Release : గత రెండేళ్ల నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఆ స్థాయిలో కొనసాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అత్యధికంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పాయి. అయితే ఈమధ్య కాలం లో ఈ రీ రిలీజ్ ట్రెండ్ హవా కాస్త తగ్గినట్టుగా అనిపించింది. కానీ నేడు విడుదలైన విక్రమార్కుడు చిత్రం ఆ అందరి అంచనాలను తారుమారు చేసింది. అప్పట్లో రాజమౌళి – రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ సినిమాని తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చెయ్యగా అక్కడ కూడా భారీ హిట్స్ గా నిలిచాయి. అలా రవితేజ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ఈ సినిమా నేడు గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది. విడుదలైన అన్నీ చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసి ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. కొన్ని చోట్ల ఈ చిత్రానికి వచ్చిన ఆక్యుపెన్సీలు రవితేజ కొత్త సినిమాకి కూడా ఈమధ్య కాలం లో రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండే ఈ సినిమాకి 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ లో విడుదలైన సినిమాలన్నీ మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద నీరసమైన వసూళ్లు రాబడుతున్న ఈ నేపథ్యం లో విక్రమార్కుడు చిత్రం ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ట్రేడ్ కి కాస్త ఊపిరి పీల్చినట్టు అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దాదాపుగా 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇదే చిత్రాన్ని రవితేజ పుట్టినరోజు నాడు ఆగష్టు 15 న విడుదల చేసి ఉంటే ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచేదని ఆయన అభిమానులు అంటున్నారు. కానీ ఆగష్టు 15 వ తారీఖున రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ చిత్రం గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.