Mega Family చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య బాగా దూరం పెరిగింది అని. గతం లో పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య దూరం పెరిగింది అనే చర్చ జరిగేది. ఇప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు అని అదే విధమైన చర్చ జరుగుతుంది. అసలు నిజం ఏమిటి ?, నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందా?, లేకపోతే కేవలం రూమర్స్ మాత్రమేనా అనేది ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చూద్దాం. మెగా ఫ్యామిలీ కి ఫౌండేషన్ వేసింది చిరంజీవి అయితే, ఆ ఫౌండేషన్ కి బలమైన మూలస్థంభం లాగ నిల్చింది పవన్ కళ్యాణ్. వీళ్లిద్దరి వల్లే మెగా ఫ్యామిలీ నేడు ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్లేంత రేంజ్ కి ఎదిగింది.
మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పుకొని వచ్చినవాళ్లే, కానీ సొంతంగా టాలెంట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ లో నిలదొక్కుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఈ కోవకి చెందిన వాడే. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యుండొచ్చు, కానీ ఆయనకీ మూలం చిరంజీవి, పవన్ కల్యాణే. అలాంటి వారిపై అల్లు అర్జున్ ఏనాడు కూడా వ్యతిరేక కామెంట్స్ చెయ్యలేదు. అలాంటి వ్యక్తి మీద నేడు ఇన్ని ట్రోలింగ్స్ ఎందుకు?. గత ఎన్నికలలో కూడా ఆయన తన సన్నిహితులైన వారికి సపోర్టు చేసాడు. పిల్లని ఇచ్చిన మామయ్య కి, తన మేనమామ పవన్ కళ్యాణ్ కి , అలాగే స్నేహితుడైన వైసీపీ నాయకుడు శిల్పా రవి కి 2019 లో మద్దతు తెలిపాడు. ఈ 2024 ఎన్నికలలో కూడా ఆయన అదే చేసాడు.
అంతే కాకుండా స్పష్టంగా ఆయన మీడియా కి నేను ఏ రాజకీయ పార్టీ కి చెందిన వాడిని కాదు, నాకు ఇష్టమైన వారికి సపోర్టుగా నిలిచాను అంతే అని అన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మీద ఈ స్థాయి నెగటివిటీ సరైనది కాదని సీనియర్ అభిమానుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఇలాంటివి అసలు పట్టించుకోడు, ఆయనకీ అల్లు అర్జున్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేది వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం సపోర్టుగా రావడంపై ఎలాంటి తప్పుపట్టడు. అది అతని వ్యక్తిగత నిర్ణయం, స్నేహితులకు సపోర్టుగా నిలవడం లో ఎలాంటి తప్పు లేదని, కానీ అభిమానులు సోషల్ మీడియా లో ఇలా దుర్భాషలాడుకుంటూ ఎంతకాలం ఉంటారు?, వాళ్లంతా ఒక కుటుంబం, ఏనాడైనా కలిసి ఒక్క వీడియో ఆప్యాయంగా పెడితే ఇన్ని రోజులు ట్రోల్ల్స్ చేసుకున్నవారు పరిస్థితి ఏమిటి?, కాబట్టి సమయం వృధా చెయ్యకుండా ఎవరి పనులు వారు చూసుకుంటే బెటర్ అంటూ సోషల్ మీడియా లో కొంతమంది సీనియర్ మెగా ఫ్యాన్స్ చెప్తున్న మాట.