Ram Charan : ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎంత తొందరగా అయితే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు కూడా. ఆ మాత్రానికి పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థని బ్రష్టు పట్టించడం ఎందుకు, డేటింగ్ చేసుకోవచ్చు కదా అని విశ్లేషకుల అభిప్రాయం. పెళ్లి అంటే పంచభూతాల సాక్షిగా ప్రమాణాలు చేస్తూ ఎలాంటి పరిస్థితి వచ్చిన విడిపోము అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాం. అలాంటి మొహాన్నతమైన సంస్కృతిని సెలబ్రిటీ హోదాలో ఉంటూ బ్రష్టు పట్టిస్తున్నారు. లక్షలాది మంది అభిమానులు కలిగి ఉన్న సెలెబ్రిటీలే ఇలా చేస్తే వారిని అనుసరించే వారి పరిస్థితి ఎలా ఉంటుంది?, పెళ్లి అనేది కామెడీ అయిపోతుంది కదా అనే ఆలోచన కూడా చెయ్యట్లేదు సెలెబ్రిటీలు.
చిన్న చిన్న గొడవలకు విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. అంతే కాకుండా పాతిక ఏళ్ళు కలిసి సంసారం చేసి సంతానం కలిగి ఉన్న వారు కూడా విడిపోతున్నారు. సమంత- నాగ చైతన్య , ధనుష్ -ఐశ్వర్య, హార్థిక్ పాండ్య – నతాషా, నిహారిక కొణిదెల – చైతన్య, శ్రీజ – కళ్యాణ్ దేవ్, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ అమిర్ ఖాన్ -కిరణ్ రావు ఇలా ఒక్కటా రెండా ఎన్నో జంటలు విడిపోవడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ ఒక సినిమాలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
అప్పట్లో ఆయన ఆరంజ్ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది కానీ, రీ రిలీజ్ లో మాత్రం బంపర్ హిట్ గా నిల్చింది. అయితే ఈ సినిమా లో ప్రేమ కొంత కాలం వరకే బాగుంటుంది, తర్వాత బాగుండదు విడిపోవాలని అనిపిస్తుంది అంటాడు. సెలెబ్రిటీలు వరుసగా ఇలా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే అప్పట్లో రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా చెప్పింది పచ్చి నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న ప్రేమికులు చూస్తే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేమ, పెళ్లి గురించి పచ్చి నిజాలు నిక్కచ్చి గా 13 ఏళ్ళ క్రితమే చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. కానీ ఆయన రియల్ లైఫ్ లో మాత్రం తన భార్య ఉపాసన ని ఎంతో ప్రేమిస్తూ అందమైన దాంపత్య జీవితం ని గడుపుతున్నాడు.