Saripodhaa Sanivaaram teaser దుమ్ములేపిన ‘సరిపోదా శనివారం’ టీజర్.. నాని కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్!

- Advertisement -

Saripodhaa Sanivaaram teaser విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తూ న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్స్ తో తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి , ఒక బ్రాండ్ గా మారడం అనేది సాధారణమైన విషయం కాదు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత వివేక్ ఆత్రేయ అనే దర్శకుడితో నాని చేస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. #RRR మూవీ ని నిర్మించిన డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. నిన్న గాక మొన్ననే షూటింగ్ ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ చిత్రం, వచ్చే నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Saripodhaa Sanivaaram teaser
Saripodhaa Sanivaaram teaser

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నేడు ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న ఎస్ జె సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎస్ జె సూర్య నటన ఈ సినిమాకి హైలైట్ అవ్వనుంది అని ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది. ప్రతీ సినిమాలో అద్భుతంగా నటిస్తూ, మరో లెవెల్ కి తీసుకెళ్తున్న ఎస్ జె సూర్య, ఈ సినిమాని కూడా మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ టీజర్ ని చూసి చెప్పొయొచ్చు.

Saripodhaa Sanivaaram' new video: Nani, SJ Suryah face-off in Vivek Athreya's film - The Hindu

- Advertisement -

ఇక న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సినిమా సినిమాకి తనలోని వేరియేషన్స్ ని చూపిస్తూ గెటప్స్ లో కూడా మార్పులు చూపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లో కూడా ఆయన కొత్తగా కనిపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ కి కూడా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికినట్టుగా అనిపించింది. గతం లో నాని వివేక్ ఆత్రేయ తో ‘అంటే సుందరానికి’ అనే చిత్రం తీసాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ చిత్రం మాత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో నెలకొంది, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here