Rajamouli : అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్లినందుకు మహేష్ పై సీరియస్ అయిన రాజమౌళి..కారణం అదే!

- Advertisement -

Rajamouli : ఇటీవలే ముంబై లో అంబానీ కొడుకు అనంత అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వారితో పాటుగా రాజకీయ, క్రీడా రంగం కి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అక్కడ ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ, చుక్కల్లో చంద్రుడు లాగ మహేష్ బాబు ఒక్కడే బాగా హైలైట్ అయ్యాడు. బ్లూ డ్రెస్ లో పొడవాటి జుట్టు, గుబురు గెడ్డంతో కనిపించిన మహేష్ ని చూసి అందరు హాలీవుడ్ హీరోస్ తో పోలుస్తూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వెయ్యడం మనమంతా చూసాము.

Rajamouli
Rajamouli

అయితే ఈ లుక్ త్వరలో ఆయన రాజమౌళి తో చెయ్యబోతున్న సినిమాకి సంబంధించినది అని తెలుస్తుంది. గత కొంతకాలం నుండి వర్క్ షాప్స్ లో కూడా మహేష్ బాబు పాల్గొంటున్నాడు. అయితే ఈ లుక్ ని రాజమౌళి అభిమానులకు చాలా సర్ప్రైజ్ గా ఉంచాలని చూశారట. మహేష్ బాబు కి కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ, ఎట్టి పరిస్థితిలో కూడా నీ లుక్ బయట తెలియకూడదు అని చెప్పాడట. కానీ మహేష్ ఇలా పెళ్లి వేడుకకి వచ్చేయడంతో రాజమౌళి కాస్త అసహనం కి గురైనట్టు తెలుస్తుంది. అది పనిగా చెప్పిన తర్వాత కూడా ఇలా చేశావేంటి మహేష్ అని రాజమౌళి మెసేజ్ చేసాడట.

Mahesh Babu and Family Shine at Anant Ambani's Wedding - Andhrawatch.com

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9 వ తారీఖున రాజమౌళి అధికారికంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలిపే అవకాశం ఉంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అవ్వగా, డైలాగ్ పోర్షన్ కి సంబంధించిన వర్క్ ఈమధ్యనే మొదలు పెట్టారట. వచ్చే ఏడాది లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్స్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం లో విలన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ ని తీసుకున్నారట. అలాగే హీరోయిన్ మరియు ఇతర క్యారెక్టర్స్ గురించి సంబంధించిన అప్డేట్స్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

SS Rajamouli shares update on his next with Mahesh Babu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here