Kalki : ‘కల్కి’ 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..20 వ రోజు ఎవరికీ సాధ్యం రికార్డు నెలకొల్పిన ప్రభాస్!

- Advertisement -

Kalki : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. సాధారణంగా ఈమధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు, కేవలం వీకెండ్ లేదా వారం రోజులు మాత్రమే ఆడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కల్కి చిత్రం లాంగ్ రన్ లో కూడా శబాష్ అనిపిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. నిన్న కూడా ఈ చిత్రానికి దాదాపుగా లక్ష 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది ఒక ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. నేడు సెలవు దినం కావడంతో నిన్న ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ మరోసారి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడిపొయాయి.

 Kalki 2898 AD 20 days collections
Kalki 2898 AD 20 days collections

సోమవారం నాడు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వస్తే, నిన్న ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ఇలాంటి రన్ ఒక పెద్ద హీరో సినిమాకి వచ్చి చాలా కాలమే అయ్యింది. మొత్తం మీద 20 రోజులకు కలిపి ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 176 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 500 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక గ్రాస్ చూసుకుంటే ఇప్పటి వరకు 978 కోట్ల రూపాయిలు వచ్చాయట.

Kalki 2898 AD box office collection day 15: Prabhas-Deepika Padukone starrer surpasses SRK's Pathaan, rakes in 543.45 crore - BusinessToday

- Advertisement -

ఈ వారం తో అధికారికంగా కూడా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరనుంది. అలాగే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 87 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ చిత్ర రికార్డుని కల్కి చిత్రం అధిగమించబోతుందని తెలుస్తుంది. ఈ వారం లోనే ఈ సినిమా నైజాం ప్రాంతం లో వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టబోతుంది. అలాగే సీడెడ్ లో కూడా ఈ చిత్రం 20 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకుంది. ఇప్పటి వరకు బాహుబలి 2 , #RRR చిత్రాలు మినహా ఈ క్లబ్ లోకి ఒక్క సినిమా కూడా చేరలేదు. ఇలా రోజుకో బెంచ్ మార్క్ ని అధిగమించుతూ ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్స్ ని నెలకొల్పుతున్నాడు ప్రభాస్.

Kalki 2898 AD box office Day 12: Prabhas film jumps to Rs 900 crore worldwide - India Today

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here