Anant Ambani : అనంత్ అంబానీ పెళ్ళికి వచ్చిన వారికి వాచీలు గిఫ్ట్..ఒక్కో వాచ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Anant Ambani : ఇటీవలే ముంబై లో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం అతిరథ మహారథుల సమక్షం లో ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒక మిలియనీర్ కొడుకు పెళ్లి ఎలా అయితే జరుగుతుందని మనమంతా అనుకుంటామో, అంతకు మించే ఈ వివాహ మహోత్సవం జరిగింది. అయితే ఈ వివాహానికి హాజరైన వారికి అనంత్ అంబానీ తరుపున వచ్చిన అందరికీ కూడా వాచీలు బహుమతిగా ఇచ్చారట. మీడియా అందిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 25 అడ్యూమర్స్ ప్రీమియర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలు ఇచ్చారట.

Anant Ambani
Anant Ambani

వీటి విలువ 2 లక్షల 50 వేల అమెరికన్ డాలర్స్ అట. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం రెండు కోట్ల రూపాయలకు పైమాటే. మొదటి నుండి అనంత్ అంబానీ కి వాచీలు అంటే ఎంతో ప్రత్యేకమైన ఇష్టం. తన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో కూడా ఆయన ప్రపంచంలోనే ఎవ్వరూ ధరించనటువంటి అత్యంత ఖరీదైన వాచీని ధరించాడు. ఇది ఒక సెన్సేషనల్ హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే ఈ వివాహ మహోత్సవానికి మన టాలీవుడ్ నుండి మహేష్ బాబు, రామ్ చరణ్, అక్కినేని అఖిల్, విక్టరీ వెంకటేష్ వంటి వారు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిల్చిన సంగతి తెలిసిందే.

When is the Ambani wedding? A timeline of the couple's 7 months of celebrations | CNN

- Advertisement -

ఇంతకు ముందు ఎన్నడూ కూడా చూడని గెటప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం తో ఆయన టాక్ ఆఫ్ ది ఇండియా గా మారిపోయారు. అలాగే రాజకీయ నాయకుల్లో ఆంధ్ర ప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ తో అంబానీ అంతటి వాడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే పలువురు ఈ వివాహ వేడుకకి ఆహ్వానం అందినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున వంటి వారు కూడా ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here