Samantha : నాగ చైతన్య కి రాఖీ కడుతాను అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Samantha : సౌత్ ఇండియా లో మోస్ట్ ట్రెండింగ్ కపుల్ గా పిలవబడే వారు సమంత – నాగ చైతన్య. ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమైన వీళ్లిద్దరి స్నేహం, ప్రేమగా మారి, ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలు ఎంతో ఆప్యాయతతో దాంపత్య జీవితం గడిపిన వీళ్లిద్దరు, కొని మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. అందుకే వీళ్ళకి సంబంధించి ఎదో ఒక న్యూస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా సమంత – నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన బయటపడింది. సమంత నాగ చైతన్య ఎప్పటి నుండో సీక్రెట్ గా ప్రేమించుకుంటూ ఉండేవారు.

Samantha kisses Naga Chaitanya in unmissable new photo

అప్పట్లో నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో ‘ఈమధ్య చైతన్య రాత్రులు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో, ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు అండీ, కచ్చితంగా వాడికి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఒకరోజు కనిపెట్టాలి’ అన్నాడు. ఇలా నాగార్జున కి మాత్రమే కాదు, అప్పట్లో సమంత సన్నిహితుల్లోనూ, అక్కినేని కుటుంబంలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ, రోజురోజుకి వీళ్లిద్దరి గురించి రకరకాల చర్చలు నడుస్తూ ఉండేవట. వీటి అన్నిటికి ఒకరోజు చెక్ పెట్టాలని బలంగా నిర్ణయం తీసుకున్న సమంత, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని నాగ చైతన్య ముందు ప్రతిపాదన పెట్టిందట. ఆమ్మో ఇప్పుడేనా, నా వల్ల కాదు, ఇంట్లో ఇంకా చెప్పలేదు అని నాగ చైతన్య అన్నాడట.

- Advertisement -

All you need to know about Samantha Ruth Prabhu and Akkineni Naga Chaitanya's separation

ఈ మాటకి చిరాకు పడిన సమంత నువ్వు వెంటనే ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పించకపోతే, రేపే నేను నీ షూటింగ్ లొకేషన్ కి వచ్చి, నీ చేతికి రాఖీ కడతాను అని బెదిరించిందట. దీంతో నాగ చైతన్య ఈమె అలాంటి పని చేసిన చేస్తుంది అని భయపడి వెంటనే ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాడట. ఇక ఆ తర్వాత తంతు మొత్తం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి ఎవరి జీవితంలో వారు బిజీ గా ఉంటున్నారు. సమంత మయోసిటిస్ చికిత్స తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. ఈమధ్యనే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా, అలాగే తమిళ హీరో విజయ్ తో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అవి అధికారికంగా ఖరారు కాలేదు. ఇక నాగచైతన్య దూత వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అయిన సక్సెస్ జోష్ తో చందు మొండేటి అనే దర్శకుడితో ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మీద అక్కినేని అభిమానుల్లో భారీ ఆశలు ఉన్నాయి. ఈ ఏడాది విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Naga Chaitanya says he and Samantha Ruth Prabhu got officially divorced a year ago: “She is a lovely person and deserves all happiness” : Bollywood News - Bollywood Hungama

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here