Prakash Raj : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించగల అతి తక్కువమంది ఆర్టిస్టులతో ఒకరు ప్రకాష్ రాజ్. పాజిటివ్ క్యారక్టర్ అయినా , నెగటివ్ క్యారక్టర్ అయినా ప్రకాష్ రాజ్ స్థాయిలో ఎవ్వరు నటించలేరు అనే విధంగా ఆయన ఎదిగారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు ఏడాదికి ఒకసారి ఇండస్ట్రీ లో పుట్టుకొస్తున్నప్పటికీ, ప్రకాష్ రాజ్ బ్రాండ్ ఇమేజి మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. సీనియర్ హీరోలతో పాటు, నేటి తరం స్టార్ హీరోలందరితో కలిసి ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. హీరోలందరితో ప్రకాష్ రాజ్ కి అద్భుతమైన కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి.
కానీ పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ కాంబినేషన్ మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా వీళ్లిద్దరు వెండితెర పై పోటాపోటీగా నటించే విధానం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ అంత పెద్ద హిట్ అయ్యింది. సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరా మెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ ఇలా ఎన్నో చిత్రాల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ కి థియేటర్స్ దద్దరిల్లాయి.
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమా గురించి తనకి ఎదురైనా ఒక అనుభవం ని ఒక ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ పంచుకుంటూ ‘నేను పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన మొట్టమొదటి చిత్రం సుస్వాగతం. ఈ చిత్రం లో భీమినేని శ్రీనివాస రావు నేను మోనార్క్ ని నన్ను ఎవ్వరు మోసం చెయ్యలేరు అనే డైలాగ్ చెప్పమని నన్ను బలవంతం చేసాడు. ఇదేమి డైలాగ్ సార్, చాలా చెత్తగా ఉంది, ఇలాంటి సినిమాల్లో పనికిరావు అనేవాడిని. కానీ భీమినేని పట్టుబట్టడంతో ఆయన గోల భరించలేక ఆ డైలాగ్ అయిష్టంగానే చెప్పాను. కానీ ఆ డైలాగ్ కాలక్రమేణా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియా లో ఈ డైలాగ్ ని నెటిజెన్స్ పలు సందర్భాలలో వాడడం చూసి సంతోషించాను. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలలో అప్పట్లో నాకు నచ్చని సినిమా కూడా ఇదే, ఇప్పుడు చూస్తే క్లాసిక్ అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.