Raj Tarun : అడ్డంగా దొరికిపోయిన రాజ్ తరుణ్..పెళ్లి పేరుతో ఇంతటి మోసమా..!

- Advertisement -

Raj Tarun సినిమాల్లో కూడా యున్న మలుపులు ఉండవేమో..! హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం లో అన్ని మలుపులు ఉన్నాయి. లావణ్య అనే అమ్మాయి ఇటీవలే నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తనని మోసం చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ ప్రేమాయణం నడుపుతున్నాడని, తనని పెళ్లి చేసుకొని కూడా ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని తనని వదిలించుకోవాలని అనుకుతున్నాడని, నాకు రాజ్ తరుణ్ ఎలా అయినా కావాలి, అతను లేకపోతే నేను బ్రతకలేను అంటూ మీడియా ముందు ఏడుస్తూ గత కొద్దిరోజుల నుండి లావణ్య ఇస్తున్న ప్రెస్ మీట్లు ఎంత వైరల్ గా మారాయో మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా లావణ్య చౌదరి మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించిన ఆడియో రికార్డులు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

Raj Tarun, Malvi, and Lavanya: Three versions, One truth

వాటిలో ఆమె బూతులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ, సీరియల్స్ లో ఉండే లేడీ విలన్ లాగా రాజ్ తరుణ్ ని చంపేస్తా అంటూ, పిచ్చి పట్టిన ఆమె లాగ మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడడం విని, ఏంటి ఈ అమ్మాయి ఇంత వింతగా ప్రవర్తిస్తుంది, డ్రగ్స్ కి బానిసైన వారు ఎలా అయితే ప్రవర్తిస్తారో, ఈ అమ్మాయి అలా ప్రవర్తిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. ఈ ఆడియో రికార్డులు బాగా వైరల్ అవ్వడంతో లావణ్య మరికొన్ని ఆధారాలతో పోలీసులను ఆశ్రయించి రాజ్ తరుణ్ పై కేసు వేసింది.

- Advertisement -

Complaint filed against Raj Tarun for cheating live-in partner! | Telugu Cinema

తనకి రాజ్ తరుణ్ కి పెళ్లి జరిగి పదేళ్లు అయ్యిందని,.అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించి, తనకి విడాకులు ఇవ్వమంటూ రాజ్ తరుణ్ వేధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా పోలీసులకు అందించినట్టుగా ఆమె మీడియా కి తెలిపింది. ఇన్ని రోజులు నాకు, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ వచ్చిన రాజ్ తరుణ్ ఇప్పుడు విడాకులు ఇవ్వమంటూ పెట్టిన మెసేజిలు ఆధారాలతో సహా దొరకడంతో అడ్డంగా బుక్ అయ్యినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద రాజ్ తరుణ్ ఈ అమ్మాయి నుండి విముక్తి పొందాలి అనుకునేది వాస్తవం, కానీ ఈ అమ్మాయికి బ్రతికేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో రాజ్ తరుణ్ ని ఇంతలా ఇబ్బంది పెడుతుందని, బయటకి వచ్చి ఇలా గజిబిజి చేసుకోకుండా, రాజ్ తరుణ్ అంతర్గతంగా ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటే మంచిది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

70 లక్షలు నొక్కేసి.. హీరోయిన్ తో సహజీవనం' | more shocking truths is coming from raj tarun and lavanya controversy - Telugu Filmibeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here