Keerthy Suresh : అయ్యో పాపం..’కల్కి’ సినిమాకి డబ్బింగ్ చెప్పడం కోసం కీర్తి సురేష్ ఇన్ని కష్టాలు పడిందా!

- Advertisement -

Keerthy Suresh : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల కనకవర్షం కురిపిస్తూ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్నీ భాషల్లో బాహుబలి సిరీస్ తర్వాత ఆ స్థాయి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకున్న ఏకైక తెలుగు పాన్ ఇండియన్ సినిమా కల్కి మాత్రమే. ఇకపోతే ఈ సినిమాకి కథ , విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బలాన్ని సమకూర్చిందో, ప్రముఖ నటీనటుల అతిధి పాత్రలు కూడా అంతే బలాన్ని సమకూర్చాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది స్టార్ నటులు ఈ చిత్రం లో కనిపించారు.

Keerthy Suresh
Keerthy Suresh

అయితే మనకి కనిపించని మరో స్టార్ నటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమా విజయం లో భాగం అయ్యింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమాలో ప్రభాస్ తో పాటుగా, బుజ్జి అనే కార్ పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పాత్రకి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఆమె డబ్బింగ్ చెప్తున్నా సమయం లో షూట్ చేసిన వీడియో ని నేడు వైజయంతి మూవీస్ వారు యూట్యూబ్ లో విడుదల చేసారు. ఈ వీడియో లో ఆమె డబ్బింగ్ చెప్పడం కోసం కష్టపడినా విధానం చూసి, అయ్యో పాపం కీర్తి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Keerthy Suresh in a sports drama

- Advertisement -

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ముందు నాగ అశ్విన్ కీర్తి సురేష్ తో మహానటి చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సావిత్రి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, కీర్తి సురేష్ కి ఉత్తమనటిగా నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అందుకే నాగ అశ్విన్ అడగగానే ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా కీర్తి సురేష్ ఈ సినిమాలోని బుజ్జి క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పింది. రెండవ భాగం లో కూడా బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్తుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here