Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు.. రీసెంట్ గా కల్కి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించాడు.. ఆ పాత్ర మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో విజయ్ క్రేజ్ పెరిగింది.. తాజాగా విజయ్ ఆహాలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ షోలో గెస్ట్ గా వచ్చాడు.. అందుకు సంబందించిన ప్రోమో నెట్టింట ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది.. ఆ షో లో విజయ్ పెళ్లి గురించి అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చాడు.. ఇంతకీ అతను చేసుకోబోయే అమ్మాయి ఎవరో ఒకసారి చూద్దాం..
ఇండియన్ ఐడల్ సీజన్ 3 షోకు గెస్ట్గా వచ్చిన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై హింట్ ఇచ్చాడు.. ఆ షోలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ టాలెంట్ని మెచ్చకుంటూ, జడ్జస్కి పంచ్లు వేస్తూ షోలో సందడి చేశాడు. ఈ క్రమంలో ఈ షో ఫీమేల్ జడ్జ్, సింగర్ గీతా మాధురి విజయ్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. మీరంటే చాలా మందికి క్రష్ మీరేమంటారు.. అంటే విజయ్ సమాధానం చెబుతూ పెళ్లి అయ్యేవరకే అంటూ పెళ్లి పై హింట్ ఇచ్చేశాడు..
ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. ఎప్పుడూ పెళ్లి ప్రశ్నలను దాటేసే విజయ్ స్వయంగా ఇలా పెళ్లంటూ స్పందించడం అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక త్వరలోనే విజయ్ ఓ ఇంటి కాబోతున్నాడా? ఏంటీ అని అందరిలో సందేహలు మొదలయ్యాయి.. అయితే రష్మిక మందన్నతో రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు గతంలో చాలానే వినిపించాయి.. రష్మిక బాలీవుడ్ లో కూడా దున్నెస్తుంది.. మళ్లీ ఆమె పెళ్లికి ఒప్పుకోవడం సాధ్యం కాదు మరి వేరే అమ్మాయిని కావొచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి దీనిపై క్లారిటి రావాల్సి ఉంది..