Anchor Pradeep : బుల్లితెర మీద యాంకర్ గా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించి అనతి కాలం లోనే పెద్ద స్థాయికి చేరుకున్న వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. ముఖ్యంగా ఢీ షో ద్వారా ఈయన సంపాదించిన క్రేజ్ మామూలుది కాదు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తో కలిసి ఆయన చేసిన సందడి కి అపూర్వమైన స్పందన లభించింది. అలా టీవీ షోస్ ద్వారా సంపాదించిన క్రేజ్ తో ఈయన కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ద్వారా హీరో గా మారాడు. ప్రదీప్ కి అదృష్టం బాగా కలిసి రావడం తో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ పాటకి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాట వలెనే సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని విశ్లేషకులు సైతం చెప్పే మాట. అయితే వరుసగా టీవీ షోస్, సినిమాలతో ఫుల్ బిజీ గా గడిపే ప్రదీప్, గత ఏడాది కాలం నుండి కనిపించకుండా పోయాడు. ప్రదీప్ అసలు ఏమయ్యాడు, అతన్ని బాగా మిస్ అవుతున్నాం, సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా లేదు అని ఆయన అభిమానులు ఇటీవల కాలం లో ఎక్కువగా పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే గెటప్ శ్రీను రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రదీప్ హీరో గా ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాలో నేను కూడా నటిస్తున్నాను అని చెప్పడంతో, ఆ సినిమా కోసమే ప్రదీప్ టీవీ షోస్ కి దూరం అయ్యాడు అనే విషయాన్నీ అర్థం చేసుకున్నారు అభిమానులు. ఇకపోతే ప్రదీప్ కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ప్రదీప్ కి ఒక చెల్లెలు ఉంది, ఈమెతో రాఖీ కట్టించుకుంటూ గతం లో ప్రదీప్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో లో ప్రదీప్ చెల్లి ని చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. ఇంత అందంగా ఉందేంటి, ఎవరెవరో సినిమాల్లోకి వస్తున్నారు, ఈమె కదా రావాల్సిన ఆమె అంటూ ఆమెని పొగడ్తలతో ముంచి ఎత్తారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ప్రకారం త్వరలోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ప్రదీప్ చెల్లికి సంబంధించిన ఫోటో మాత్రం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటో ని మీరు కూడా చూసేయండి.