Samantha : సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత నాగ చైతన్య జంట. ఏ మాయ చేసావే సినిమాతో ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగా వీళ్లిద్దరి కాపురం సాగినప్పటికీ, మధ్యలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, ఇద్దరి మధ్య పరస్పరం గొడవలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. అయితే ఎందుకు వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది అనే కారణాలు మాత్రం ఇప్పటి వరకు సరిగ్గా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా లో అనేక కథనాలు, ఊహాగానాలు ఎవరికీ తోచింది వారు రాసుకున్నారు కానీ, వీళ్ళ విడాకులకు కారణం ఏమిటో తెలియడం లేదు. అయితే సమంత పెళ్లి తర్వాత కూడా ముద్దు సన్నివేశాల్లో నటించడం నుండే వీళ్ళ మధ్య గొడవలకు భీజం పడిందని అంటున్నారు.
అందుకు పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కారణమని అంటున్నారు. ఎలా అంటే పెళ్ళైన తర్వాత సమంత ఒప్పుకున్న చిత్రాలలో ఒకటి రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కి ముందుగా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకుందాం అనుకున్నారు కానీ, ఆమెకంటే బెటర్ ఛాయస్ గా సుకుమార్ కి సమంత ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అయితే ఈ చిత్రం లో లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది, అది కచ్చితంగా చెయ్యాలి , కథకి అత్యవసరం, మరి పెళ్ళైన సమంత అందుకు ఒప్పుకుంటుందా అని మెగాస్టార్ చిరంజీవి ని సలహా అడగగా, పెళ్ళైతే ఏమిటి?, నటించడం మానలేదుగా?, ఆమెని కలిసి కథ చెప్పండి, పాత్ర నచ్చితే చెయ్యమని చెప్పండి అని అన్నాడట మెగాస్టార్ చిరంజీవి.
ఆ తర్వాత సుకుమార్ సమంత ని కలిసి కథ చెప్పడం, ఆమెకి నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే సినిమా విడుదల తర్వాత సమంత, నాగ చైతన్య మధ్య ఏర్పడిన మొట్టమొదటి గొడవ రంగస్థలం లో చేసిన ఆ ముద్దు సన్నివేశమే. ఆ తర్వాత సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో హద్దులు దాటి అందాల ఆరబోతల చెయ్యడం వల్ల వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి విడాకులు తీసుకునేందుకు కారణం అయ్యాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మొదటి గొడవకి భీజం పరోక్షంగా చిరంజీవి అయ్యాడు కాబట్టి, ఆయన కూడా వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.