Actress : రోడ్డు పై టిఫిన్ బండిని నడుపున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

- Advertisement -

Actress : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగం లో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, బోలెడంత అదృష్టం ఉండాలి. మన టాలీవుడ్ లో కొనసాగుతున్న కొంతమంది స్టార్ హీరోలకంటే మంచి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు అదృష్టం కలిసిరాక కృష్ణ నగర్ లో ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత ఎంతో మంది సామాన్యుల టాలెంట్ బయటకి వచ్చింది. ఆ సామాన్యులే సెలెబ్రిటీలుగా మారారు. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యి సినిమాల్లో అవకాశాలు సంపాదించిన ఒక నటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న ఆమె పేరు ఝాన్సీ.

ఈమె నల్గొండ జిల్లాలోని నకిరిల్ మండలం కి చెందిన మహిళ. ఈమెని రీసెంట్ గా ఇంటర్వ్యూ చెయ్యగా, చిన్నతనం లో నకిరిల్ మండలం లోని రామకృష్ణ వెంకటేశ్వర థియేటర్స్ లో సినిమా శబ్దాలు వింటూ చాలా సంబరపడేదానిని అని, అప్పటి నుండే నాకు సినిమాల్లో నటించాలనే కోరిక మొదలైందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ సమయం లో దుబ్ స్మాష్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ వంటివి నా నటనకి ప్రాక్టీస్ లాగ మారాయని, అలా నాకు పెళ్ళై కొడుకు పుట్టిన తర్వాత నా వీడియోల ద్వారా వచ్చిన పాపులారిటీ కారణంగా సినిమాల్లో, సీరియల్స్ నటించే అవకాశం దక్కిందని, పలు షోస్ కి యాంకర్ గా వ్యవహరించే అవకాశం వచ్చిందని, పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా వచ్చాయని ఈమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్‘ చిత్రం లో కూడా నటించిందట. ఈ సినిమాతో పాటుగా ఎన్నో క్రేజీ మూవీస్ లో ఆఫర్స్ ని దక్కించుకుంటూ, ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క టిఫిన్ బండిని నడుపుకుంటూ జీవనం ని కొనసాగిస్తుంది ఝాన్సీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here