Disha Patani : ‘కల్కి’ హీరోయిన్ దిశా పటాని చేతిపై ఆ స్టార్ హీరో పేరుతో టాటూ..!

- Advertisement -

Disha Patani : టాలీవుడ్ లో ‘లోఫర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయిన హీరోయిన్ ‘దిశా పటాని’. ఈమె కెరీర్ లో హిట్స్ ఒకటి రెండుకి మించి లేవు. కానీ సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. పొట్టి దుస్తులు ధరించి, ఈమె చేసే వర్కౌట్ వీడియోస్ కి మిలియన్ల కొద్దీ లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.

Disha Patani
Disha Patani

అయితే కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈమెకి రీసెంట్ గా విడుదలైన కల్కి చిత్రం మెగా బ్లాక్ బస్టర్ అవ్వడం కాస్త ఊరటని ఇచ్చింది. సినిమాలో ఈమె కనిపించేది చాలా తక్కువసేపే. అయినప్పటికీ కూడా ఆడియన్స్ గుర్తించుకోదగ్గ పాత్రనే చేసింది. అంతే కాకుండా ఈమెతో కలిసి ప్రభాస్ చేసిన పాటకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ పాటలోని స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా దిశా పటాని చెయ్యి మీద ఉన్న టాటూ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ‘PD’ అని ఉన్న ఈ టాటూ ని చూసి సోషల్ మీడియా లో అభిమానులు ‘ప్రభాస్ దిశా’ గా అనుకుంటున్నారు. షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారిందని, అందుకే దిశా పటాని ఇలాంటి టాటూ వేయించుకుంది అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం దిశా పటాని తోనే కాదు, ఈమధ్యకాలం లో ప్రభాస్ ఏ హీరోయిన్ తో సినిమా చేసిన రూమర్స్ సోషల్ మీడియా లో వీరవిహారం చేస్తున్నాయి.

- Advertisement -

Disha Patani New Tattoo Prabhas Name

గతం లో కూడా ఆదిపురుష్ సమయం లో కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నాడని, వీళ్లిద్దరికీ విదేశాల్లో నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభాస్, కృతి సనన్ పదే పదే ఇంటర్వూస్ లో చెప్పడం తో ఆ వార్తలకు చెక్ పడింది. అంతకు ముందు అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్స్ తో కూడా ప్రభాస్ డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి దిశా పటాని కూడా చేరిపోయింది. సోషల్ మీడియా లో ఈ టాటూ బాగా వైరల్ అయిపోయింది కాబట్టి, దీనిపై దిశా పటాని ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here