Gabbar Singh : పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి గబ్బర్ సింగ్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని మరోసారి టాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా నిలిపింది ఈ చిత్రం. అభిమానులు తమ హీరోని ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, దర్శకుడు హరీష్ శంకర్ అలా చూపించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టాడు. ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ చిత్రానికి ముందు హీరోయిన్ శృతి హాస్సన్ ని అన్నీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. అప్పట్లో ఆమెని అందరూ ఐరన్ లెగ్ ని పిలిచేవారు. ఇక ఆమె కెరీర్ అయిపోయింది అని అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం ఆమెని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది.
అలాగే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ కూడా ఓవర్ నైట్ స్టార్ నిర్మాత అయిపోయాడు. ఈ చిత్రానికి ముందు ఆయన చేసిన రెండు చిత్రాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆయనకీ ఈ చిత్రం కొత్త ఊపిరిని పోసింది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇంతమందికి ఉపయోగపడిన ఈ గబ్బర్ సింగ్ సినిమా, ఒక నటి కి మాత్రం శాపంలాగా మారింది. ఆమె ఎవరో కాదు, గాయత్రీ రావు. ఈమె హ్యాపీ డేస్ చిత్రం లో అప్పుగా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈ చిత్రం తర్వాత ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఛాన్స్ వచ్చేలోపు ఎగిరి గంతులేసింది. ఇందులో ఆమె శృతి హాసన్ స్నేహితురాలిగా, పవన్ కళ్యాణ్ కి సైట్ కొట్టే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ కథ ఆమెకి చెప్పినప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్, ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లాగ ఉంటుందని, మీరు కూడా ఒక్క హీరోయిన్ అని చెప్పి ఒప్పించారట. కానీ సినిమా చూసిన తర్వాత తనకి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చినందుకు గాయత్రీ రావు బాగా నిరాశకి గురైంది అట. ఈ విషయం ఆమె తల్లి బెంగళూరు పద్మ చెప్పుకొచ్చింది. ఈమె కూడా అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఇక సినీ కెరీర్ కి ఫులుస్టాప్ పెట్టి, చదువు మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి, పెళ్లి చేసుకొని స్థిరపడిపోయిందని, గబ్బర్ సింగ్ వల్ల తన కూతురు సినీ కెరీర్ ఆగిపోయినప్పటికీ, వ్యక్తిగతంగా మరో వృత్తి లో స్థిరపడింది అని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.