స్టార్ సెలెబ్రిటీలు ఈమధ్య కాలం లో ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు. ఇటీవల కాలం లో ఎన్నో సంఘటనలు మనం చూసాము. ఇప్పుడు తమిళ హీరో జయం రవి కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని కుదిపేస్తోంది. జయం రవి ఎడిటర్ మోహన్ కుమారుడిగా, డైరెక్టర్ మోహన్ రాజా (గాడ్ ఫాదర్ డైరెక్టర్) తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈయన అప్పట్లో తెలుగులో బాలనటుడిగా కూడా పలు సినిమాల్లో నటించాడు, కానీ తమిళం లోనే స్థిరపడ్డాడు. యంగ్ హీరో నితిన్ నటించిన ‘జయం’ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాని తమిళం లో రీమేక్ చేసారు. ఈ చిత్రం ద్వారానే రవి హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం, ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయన్ని అప్పటి నుండి అందరూ జయం రవి అని పిలుస్తూ వస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎదిగి, ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన వైవాహిక జీవితం విషయానికి వస్తే జయం రవి ప్రముఖ నిర్మాత సుజాత కుమార్తె ఆర్తిని 2009 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య ఈమధ్య కాలం లో ఏర్పడుతున్న కొన్ని విభేదాల కారణంగా విడిపోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియా లో చర్చ కొనసాగుతుంది.
దీనిపై అటు జయం రవి కానీ, ఇటు ఆర్తి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా ఆర్తిని పెళ్లి చేసుకునే ముందు రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య ని జయం రవి కి ఇచ్చి చెయ్యాలని అనుకున్నారట. కానీ జయం రవి అప్పటికే ఆర్తి తో ప్రేమ వ్యవహారం లో ఉన్న విషయం తెలుసుకొని రజిని వెనక్కి తగ్గాడు. అయితే ఇప్పుడు ఐశ్వర్య – ధనుష్ కి విడాకులు అయ్యింది, అదే విధంగా జయం రవి కూడా విడాకులు తీసుకోబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఐశ్వర్య తో మొదటి నుండి జయం రవి కి మంచి స్నేహం ఉండడం తో వీళ్లిద్దరు భవిష్యత్తులో రెండవ పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ తమిళనాడు మీడియా లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.