Rashi Kanna : పెళ్లి కాకుండానే బేబీని లాలిస్తూ కనిపించిన రాశి ఖన్నా.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్

- Advertisement -

Rashi Kanna : టాలీవుడ్ యంగ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 10సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా రాశి ఖన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్లతో కెరీర్ లో దూసుకుపోతూ తక్కువ టైంలోనే స్టార్ హీరోల అందరితో కలిసి పని చేసింది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, శివమ్ వంటి హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తర్వాత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌ పై కన్నేసింది. అయితే దానికి కారణం ఈ అమ్మడుకి టాలీవుడ్‌లోని ఓ హీరోతో గొడవలు జరగడం వల్లేనని పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ సినిమాల్లో ఛాన్సులు రాకపోవడం వల్లేనని అభిమానులు అంటున్నారు. ఇటీవల యోధా సినిమాతో మరో హిట్ అందుకుంది. గత నెలలో సుందర్ సి దర్శకత్వం వహించిన ‘అరణ్మనై 4’లో నటి తమన్నా భాటియాతో కలిసి హారర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ , ‘తలాఖోన్ మే ఏక్’ వంటి పెద్ద చిత్రాలు నటిస్తుంది. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే సినిమా కూడా చేస్తుంది.

అంతేకాకుండా ‘అరుణ్మై-4’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ కూడా బాగానే రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అయితే రాశిఖన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన పలు పోస్టులతో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. తాజాగా, ఈ అమ్మడు పెళ్లి కాకుండానే ఓ చిన్న పాపని ఎత్తుకుని ఉన్న ఫోటోలో షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఇందులో చిన్న పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాకుండా ‘‘నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబం చాలా ఆనందమయం అయింది. మా లిటిల్ ప్రిన్సెస్. మాటల్లో చెప్పలేనంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను’’ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం రాశి ఖన్నా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారు కొందరు మీలాగే క్యూట్, అండ్ బ్యూటిఫుల్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు మాత్రం కంగ్రాట్స్ రాశి ఖన్నా అంటున్నారు.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here