Kalki 2898AD : ప్రస్తుతం భారత దేశంలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరంటూ ఎవరైనా ఠక్కున చెప్పే పేరు దర్శకధీరుడు రాజమౌళి. తన కెరీర్లో ఇంత వరకు ఫ్లాప్ సినిమానే లేదు. చేసిన ప్రతి సినిమాను హిట్ చేయించడం రాజమౌళికి మాత్రమే సాధ్యమైంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు. అంతే కాకుండా, డైరెక్టర్ గా గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన అద్భుతం రాజమౌళి. అలాంటి రాజమౌళికి ధీటైన దర్శకుడు ఎవరంటే.. ఎవరో ఒకరి పేరు బలంగా చెప్పడం కష్టమే. అయితే అదంతా నిన్నటి వరకు. ఇప్పుడు లెక్క మారిపోయింది. రాజమౌళికి సవాల్ విసిరే దర్శకుడు వచ్చేశాడు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మార్మోగిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రం తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమా రాలేదని, విజువల్ వండర్ అని, హాలీవుడ్ సినిమాలను తలపించేలా ‘కల్కి 2898 AD’ చిత్రం ఉందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని మలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు విజన్ గొప్పగా ఉందని.. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రాజమౌళిని సవాల్ చేసే అసలుసిసలైన డైరెక్టర్ ఇతడే అన్న కలుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు జనాల నుంచి అద్భుతమైన టాక్ వస్తుంది. చూస్తున్నంత సేపు ఫ్యూజులు ఎగిరిపోయాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో బాహుబలి సినిమానే తోపు అనుకున్నకున్న వాళ్లకు కాదు కాదు కల్కి సినిమా అంతకుమించి అనే రేంజ్ లో తీశారు డైరెక్టర్ నాగ అశ్విన్. మరీ ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ .. ఆయన నటించిన తీరు పండించిన కామెడీ సినిమాకే హైలెట్ అవుతుంది అంటున్నారు.