Nivetha : మళ్లీ విశ్వక్ సేన్ తో సినిమాలు చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -

Nivetha : యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో శ్రీవిష్ణుతో కలిసి ‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన అందం, నటన పరంగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నివేత, పరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను సిద్ధార్థ్ నాయుడు, వడ్డపాటి రాజేశఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. జూన్ 14న జీ 5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇదిలా ఉంటే తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ విశ్వక్‌ సేన్ తో సినిమాలు చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం విశ్వక్ సేన్ టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. సినిమాలకు సంబంధించిన వార్తలతో పాటు వరుస వివాదాలతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. తన సినిమాలను వింతగా ప్రమోట్ చేస్తూ గతంలో చాలా వివాదాలకు తెరలేపాడు. కంటెంట్ వెళ్లాలంటే దానికి ముందు ఓ కాంట్రవర్సీ ఖచ్చితంగా జరగాలి అని బలంగా నమ్ముతాడు. అందుకే ప్రేక్షకులు.. ఇతని సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ మధ్య విశ్వక్ సేన్ నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లనే రాబట్టింది.

- Advertisement -

విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ కాంబినేషన్లలో ‘పాగల్’, ‘మాస్ క ధమ్కీ’ వంటి రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల టైంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరిగాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీని విశ్వక్‌తో మీరు మూడు సినిమాలు చేశారు కదా అని ప్రశ్నించింది. దీనికి నివేతా.. ‘నేను విశ్వక్‌తో చేసినవి రెండు (పాగల్, మాస్ క ధమ్కీ) సినిమాలే’ అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. కానీ ఆ యాంకర్ ‘భూ’ ప్రస్తావన తీసుకుని రాగా.. ‘విశ్వక్ ఆ సినిమాలో నటించినట్టు నాకు తెలీనే తెలీదు’ అంటూ ఆన్సర్ ఇచ్చింది. మళ్లీ యాంకర్ మీ కాంబోలో నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ప్రశ్నించగా ఇక విశ్వక్‌తో సినిమా చేయను అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here