Ileana : సినీ నటి, గోవా బ్యూటీ, సన్న నడుము చిన్నది ఇలా ఇలియానాకు ఎన్ని పేర్లో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మడు ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, నటన, నడుము వంపులతో కుర్రకారు మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. దాదాపు 15ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలకు దూరం అయింది. రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. ఆ బిడ్డకు తండ్రి ఎవరో చాలా కాలం తర్వాత పరిచయం చేసింది. కానీ ప్రస్తుతం మళ్లీ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సినిమాల్లో ఇలియానాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆమె నటనతోపాటు తన సన్నని నడుము ప్రధాన కారణమని చెప్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ‘సన్న నడుము’ హీరోయిన్గా అందరినీ ఆకర్షించింది ఈ అమ్మడు. ఆమెతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అంతా ప్రధానంగా ఆమె నడుముపైనే ఫోకస్ పెట్టేవారట. పోకిరి సినిమా మొదలుకుని దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని.. వరకు దాదాపు ప్రతీ సినిమాలో ఇలియానా నడుము పైనే కెమెరా కేంద్రీకరించే వారు.
అప్పట్లో సినీ పరిశ్రమ అంతటా ఈ గోవా బ్యూటీ నడుముపై భారీ డిస్కషన్ నడిచింది. ఆమె నడుమును వర్ణిస్తూ ఎన్నో పాటలు, కవితలు కూడా వచ్చేశాయి. అయితే ఎక్కువగా తన నడుమునే ఫోకస్ చేయడం పట్ల ఇలియానా చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేసిందట. ఒకరోజు తనతో సినిమాలు తీసిన డైరెక్టర్ల మీద సీరియస్ అవుతూ.. ‘నా శరీరంలో మరే పార్టు లేనట్టు.. ఎందుకని నా నడుమునే చూపిస్తున్నారు’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా పంచుకున్న ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని విన్న ఆమె అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘నడుము వల్లే కదా నువ్వు అంత ఫేమస్ అయ్యావు’ అంటూ ఆమెను పొగిడేస్తున్నారు.