Isha Koppikar : ఆ హీరో నన్ను ఒంటరిగా రూంకి రమ్మని పిలిచాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -

Isha Koppikar : ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా బయటపెడుతూ ఎమోషనల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్లతో సహా చాలామంది తమ కెరీర్లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో అసలు ఉంటాయా అని కొందరు ఆశ్చర్యపోయారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఇదే విషయాలను వెల్లడించడంతో వారు నమ్మక తప్పడం లేదు. తాజాగా, స్టార్ హీరోయిన్ ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్‌ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు తనకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంది. ‘‘ఒకప్పుడు సినిమాలో పాత్రలను నిర్ణయించే శక్తి ఎక్కువగా హీరోలకు మాత్రమే ఉండేది. అయితే చాలా మంది హీరోయిన్లు ఒత్తిడి కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని అనుకునేవారు.

ఈ క్రమంలో.. నాతో కొంతమంది.. సినిమాల్లో ఛాన్సులు రావాలంటే నటీనటులతో క్లోజ్‌గా ఉండమని సలహా ఇచ్చారు. దీంతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను. అప్పుడు తెలియకపోవడం వల్ల అలా చేశాను. కానీ ఆ తర్వాత దాని అర్థం వేరని తెలుసుకున్నాక షాక్ అయ్యాను. నాకు 23ఏళ్లు ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. ఓ స్టార్ హీరో నన్ను ఒంటరిగా కలవాలని అడిగాడు. నాతో నా డ్రైవర్ కూడా ఉండకూడదని ఆదేశించాడు. నా రూమ్‌కి రా అని కూడా డైరెక్ట్‌గా అడిగాడు. నేను కొంతమంది హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కాబట్టి ఎవ్వరికీ తెలియకుండా నువ్వు నన్ను కలవాలని అన్నాడు.

- Advertisement -

కానీ నేను అతనిని కలవడానికి ఇష్టపడలేదు. ఏం మాట్లాడుతున్నారు.. నేను అలాంటి దాన్ని కాదని చెప్పి వచ్చేశాను’’ అంటూ చెప్పుకుని ఎమోషనల్ అయింది. ఇషా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు జనాలు. ఇక ఇషా సినిమాల విషయానికొస్తే వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగార్జున చంద్రలేఖ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. కానీ ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. బాలీవుడ్‌ చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here