Anchor Rashmi : నూకరాజుని చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ

- Advertisement -

Anchor Rashmi : బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాలను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్లు పరిచయం అయ్యారు. అలాంటి వారిలో నూకరాజు ఒకరు. అలాగే అదే షో ద్వారా పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మీ చెప్పు తెగుతుంది అంటూ నూకరాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడూ కూల్ గా ఉంటూ టీం లీడర్స్ తనపై వేసే పంచులను లైట్ తీసుకునే రష్మీకి అంత కోసం వచ్చే విధంగా నూకరాజు ఏం చేశాడని ఆలోచిస్తున్నారా చూద్దాం.

 

యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పాటు పలు సినిమాలు కూడా చేసి తన అందాలతో అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై వరుస షోలు చేస్తున్నది. అయితే ఇటీవల ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కి చెక్ పెట్టి జబర్ధస్త్‌ని రెండు రోజుల పాటు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జూన్ 21, 22న రిలీజ్ కాబోతున్న జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

అందులో ఎప్పటిలాగే కొన్ని హైలెట్ సీన్స్ ను ప్రేక్షకులకు చూపించి షోపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఏంటి రష్మీ ఎలా ఉన్నావ్ అని నూకరాజు ముందుగా రష్మిని పలకరించాడు. వెంటనే రష్మి స్కిట్ లో కామెడీ ఉంటుందా లేదా అంటూ పంచ్ వేసింది. ఆమె రెండు మూడు సార్లు చెప్పినప్పటికీ వినిపించినట్టుగా ప్రవర్తిస్తాడు నూకరాజు. దీంతో మరోసారి ‘స్కిట్టులో కామెడీ వుంటుందా’ అని మళ్ళీ ప్రశ్నించింది. మళ్లీ ఏం వినపడనట్టే చేసి.. ‘ఆ’ అంటూ నూకరాజు పక్కకి తిరుగుతాడు.

- Advertisement -
Anchor Rashmi
Anchor Rashmi

దీంతో విసిగిపోయిన రష్మీ రా ముద్దు పెడతా అంటూ పిలుస్తుంది. నూకరాజు వెంటనే ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తుంటే చెప్పు తీసుకుని కొడతాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో నూకరాజు నవ్వుకుంటూ అక్కడే ఆగిపోయాడు. నిజానికి ఇదంతా ఫన్నీ గానే జరిగింది. కానీ జబర్దస్త్ నిర్వాహకులు తాజా ప్రోమోలో దాన్ని హైలెట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సెట్ అంతా నవ్వులమయం అయిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here