Ester Noronha: ఎస్తేర్ నోరోన్హా.. ఈ అమ్మడు పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కానీ మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టొచ్చు. అప్పుడెప్పుడో సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో ఎస్తేర్ నోరోన్హా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది ఎస్తేర్. ఈ చిన్నది సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత సునీల్ తో సినిమా చేసింది. ఈ బ్యూటీ తన నటనతో పాటు.. అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఫెడ్ అవుట్ అయ్యింది. ఇంతలోనే సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
కానీ ఆ వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆర్నెళ్ల కాలంలోనే ఆ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతం ఎస్తేర్ నోరోన్హా ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తుంది. నోయెల్‌తో విడిపోయిన తర్వాత ఎస్తేర్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్స్ సీన్స్ లోనూ నటించేందుకు సై అంటుంది. అలాగే 69 సంస్కార్ కాలనీ, రెక్కీ ఆమె సినిమాల్లో రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ అమ్మడు అందాలను ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.
ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూనే డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మారింది. సొంతంగా బ్యానర్ నిర్మించి ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు ఇంటర్వ్యూల్లో ఎస్తేర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా.? అన్న ప్రశ్నకు. తనకు ఒంటరిగా ఉండాలని లేదని, రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. మగాళ్లు అడగటం మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం కూడా ఇండస్ట్రీలో ఉందని తెలిపింది. అయితే ఛాన్సుల కోసం క్యారెక్టర్ మార్చుకోను.. అందువల్లే తనకు చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్పింది. మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే ట్రోల్ చేస్తారు. అంతే కాదు వేశ్య అని ముద్రవేస్తారంటూ మండి పడింది. ఆడవాళ్లకు కోరికలు ఉండకూడదా.? అదేదో పెద్ద నేరం లా ఇప్పటి సమాజం చూస్తుంది. ఆడవాళ్లకు ఓ జీవితం ఉంటుంది. వారికి ఎమోషన్లు ఉంటాయని చెప్పుకొచ్చింది.