Sree Vishnu : యంగ్ టాలెండెటెడ్ హీరో ఏంటి ఇలా అయిపోయాడు.. ఎవరో గుర్తుపట్టారా

- Advertisement -

Sree Vishnu : సినిమా అనేది బయటకు కనిపించే అంత అందంగా ఉండదని అందరికీ తెలుసు. సినిమా రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఒక్కోసారి సినిమా కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం కావాల్సిందే. అలాగే సినిమాకు ఫిక్స్ అయ్యారంటే దానికోసం తమను తాము ఎంతలా మార్చుకోవడానికైనా రెడీ అవుతూ ఉంటారు టాలీవుడ్ స్టార్స్.

పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచుకోవడం నుంచి ఫ్యామిలీ ప్యాక్‌గా మార్చుకోవ‌డం వరకు దేనికైనా రెడీ అవుతుంటారు. కొన్నిసార్లు సినిమా కోసం ప్రస్తుతం ఉన్న ఏజ్ కంటే కూడా పెద్ద వయసు వాడిలా మార్చేసుకుంటారు. అయితే ఈ పై ఫోటోలో ఉన్న హీరో కూడా సరిగ్గా ఇదే కోవలోకి వస్తాడు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఓ సినిమా కోసం ముసలివాడిలా మారిపోయి నటించడానికి రెడీ అయ్యాడు.

Sree Vishnu
Sree Vishnu

ఇంతకీ ఈ టాలెంటెడ్ హీరో ఎవరని అనుకుంటున్నారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే లెండి.. అతను మరెవరో కాదు తాజాగా ఓం భీమ్ బూష్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చి భయపెట్టిన శ్రీవిష్ణు. ఇప్పుడు స్వాగ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హసిత్ గోలి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ విష్ణు.. భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో అతని మేకోవర్ చూసి జనాలు షాక్ అయ్యారు.

- Advertisement -

ఎందుకంటే శ్రీ విష్ణు ముసలివాడిలా కనిపిస్తున్నాడు.. ఇంతే కాదు శ్రీ విష్ణు సినిమాలో ఇంకా బోలెడు గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు ఈ గ్లింప్స్‌ చూస్తే అర్థం అవుతుంది. స్వాగ్‌లో రీతు వర్మ హీరోయిన్ గా నటించనుంది. అలాగే సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. దక్షిన‌గార్కర్ స్పెషల్ రోల్ లో నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ చూస్తే పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా స్వాగ్‌ రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here