Lavanya : లావణ్య త్రిపాఠి జీవితం సమంతలా మారిపోనుందా.. తెరపైకి షాకింగ్ విషయాలు!

- Advertisement -

Lavanya : ఇండస్ట్రీలో ఓ వార్త ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. పెళ్లికి ముందు చాలా మంది హీరోయిన్లు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలినప్పటికీ.. పెద్దింటి కోడలిగా వెళ్లిన తర్వాత సినిమాలకు దూరంగా సైలెంట్ అయిపోతున్నారు. పూర్తిగా సినిమాల్లో నటించకుండా అటు సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్ గా ఉండకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అత్తింటి వారు పెట్టే ఆంక్షల వల్ల నటనకు దూరమవుతున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె.. పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. అత్తింతి వారి నియమనిబంధనలకు తట్టుకోలేకనే డివోర్స్ తీసుకుందనే చర్చ గత కొద్ది కాలంగా జరుగుతూనే ఉంది.

విడాకులు తీసుకున్న తర్వాత ఆమె దురదృష్టమేంటో కానీ మయోసైటీస్ కారణంగా సమంత సినిమాలు చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండి హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా, సమంత జీవితం లాగే మరో హీరోయిన్ జీవితం కూడా మారబోతుందంటూ ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు తన కెరీర్ లో పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. పెళ్లి తర్వాత కేవలం ఒక్క మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఓకే చేయలేదు.

- Advertisement -

అలాగే సోషల్ మీడియాలోనూ అంతంత మాత్రంగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడుతుంది. దీంతో పెద్దింటి కోడళ్లు అయ్యాక హీరోయిన్ల పరిస్థితి ఇలాగే మారుతుందా? అని పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. అలాగే అత్తింటి వారు పెట్టే రూల్స్ వల్ల డివోర్స్ అవుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. సమంత జీవితంలాగే లావణ్యది కూడా తొందరలోనే మారిపోనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో నిజమెంతో తెలియదు కానీ.. పలువురు మాత్రం ఇదే పనిగా ఈ విషయం పై చర్చించుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here