Pawan Kalyan : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వేసుకున్న డ్రస్ అంత స్పెషలా ?

- Advertisement -

Pawan Kalyan : సోషల్ మీడియా వాడకం ప్రస్తుతం ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. దీంతో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా క్షణాల్లో ట్రెండ్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వాళ్ల లైఫ్ స్టైల్ ను ఫాలో అయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. సెలబ్రిటీలు వేసుకునే క్యాస్టూమ్స్, నగలు ఇతరత్రాలకు సంబంధించిన బ్రాండ్స్ విషయాలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవా గురించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో అన్న లెజినోవా పేరు హైలెట్ అవుతోంది. రీసెంట్ గా ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 70వేల భారీ మెజారిటీతో గెలిచారు. భర్త గెలిచాడు అని తెలియగానే అన్నా లెజినోవా బయటకు వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఏకంగా నరేంద్ర మోడీని కలవడానికి కూడా పవన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది. ఆ తర్వాత గ్రాండ్ గా మెగా ఫ్యామిలీ వెల్కమ్ చెప్పడంలోనూ హైలైట్ గా మారింది. ఈ క్రమంలోని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆమె వేసుకున్న బ్లూ డ్రెస్ హైలైట్ అయింది.

- Advertisement -

ఈ డ్రెస్ వెనుక పెద్ద కథే ఉందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమె పుట్టిన రోజు నాడు సర్ప్రైజ్ గా కొనిచ్చిన గిఫ్ట్ ఇదేనట. ఆ కారణంగానే ఆమె జీవితంలోనే మోస్ట్ స్పెషల్ మూమెంట్ డే నాడు వేసుకుందంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ డ్రెస్ అన్నా లెజినోవాకు బాగా సూట్ అయిందంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఇలా కూడా భార్యను సర్ ప్రైజ్ చేస్తాడా అంటూ ఓ రేంజ్ లో తెగ పొగిడేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here