Jyothi Purvaj : తానో ‘మాస్టర్ పీస్’.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న జగతి ఆంటీ.. హీరో ఎవరంటే ?

- Advertisement -

Jyothi Purvaj : సినిమా హీరోయిన్లతో పోటీ పడుతూ చాలామంది సీరియల్ నటీమణులు కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్స్ నుంచి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కొంతమంది సీరియల్స్ లోనే స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇక సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించి.. సోషల్ మీడియాలో హద్దులే లేవంటూ అందాలతో పిచ్చెక్కించే భామలు చాలా మంది ఉన్నారు.. వారిలో జ్యోతి రాయ్ ఒకరు. సీరియల్స్ ఫాలో అయ్యే వారికి ఈ అమ్మడు బాగా తెలుసు. గుప్పెడంత మనసు అనే సీరియల్ లో జగతి మేడం గా నటించింది. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో ఎంతో హుందాగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ ఈ చిన్నది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు వెండితెరపై అందాలను ఒడ్డించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి వెరైటీ సినిమాల తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ఏ మాస్టర్ పీస్. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తు్న్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక కొత్త కాన్సెప్టులో సూపర్ హీరో మూవీ ఎక్స్పీరియన్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవలే హైదరాబాద్ లో సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ – సీరియల్స్ ద్వారా నేను మీకు పరిచయమే. “ఏ మాస్టర్ పీస్” సినిమాతో హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో నా పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. సుకుతో నా మ్యారేజ్ జరిగింది. అప్పటినుంచి టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయిందన్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా, దర్శకుడు సుకు మూవీలో నా క్యారెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here