Love Mouli : హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. 2004లో జై సినిమాతో 19ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా అతడికి అమ్మాయిలు మాత్రం ఫిదా అయిపోయారు. 2007లో చందమామ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. గౌతమ్ ఎస్సెస్సీ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఆర్య 2లో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు.. ఇక అప్పటి నుంచి సెకండ్ లీడ్ హీరోగా మారి సినిమాల్లో నటిస్తున్నాడు. వరుస సినిమాల్లో చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో పలు సినిమాల్లో కీలక పాత్రలకే పరిమితం అయిపోయాడు. వెండితెరతో పాటు బుల్లితెర మీద పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు.
చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా నవదీప్ హీరోగా లవ్ మౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో నవదీప్ పూర్తిగా లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అవనీంద్ర డైరెక్షన్ చేసిన ఈ చిత్రం పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందింది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. అలాగే ఈ సినిమాలో నవదీప్ పెయింటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో 42 లిప్ కిస్సింగ్ సీన్లు ఉన్నాయని అంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో 25 లిప్ కిస్‌లు ఉన్నాయి. అప్పటికి అవే ఎక్కువనుకుంటే.. ఈ సినిమాలో ఏకంగా 42 లిప్ కిస్సింగ్ సీన్లు ఉన్నాయి. జూన్ 7న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి ఈ మూవీ హిట్ అవుతుందో? లేదో చూడాల్సిందే.