Aamani : సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమని. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కొన్నేళ్ల తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి .. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు బుల్లితెర షోలలోనూ తను సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ పై తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఆమని క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. అలాంటివన్నీ సాధారణం.. అలనాటి స్టార్ బ్యూటీ సావిత్రి కాలం నుంచి హీరోయిన్లు సమస్యలను ఎదుర్కొంటున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తుంది. అంతేకాదు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపిస్తున్నారని వివరించింది.
అయితే ఏ ప్రొఫెషన్ లో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. కష్టాలను దాటుకునే స్టార్ గా ఎదగాలి. ఇక నా విషయంలో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైంలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరైతే ఏకంగా మా అమ్మ, అన్నల ముందే బట్టలు తీసి చూపించమని డిమాండ్ చేసేవారు. ఆ రోజులు గుర్తుకు వస్తే నాకు ఇప్పటికీ భయం కలుగుతుంది. ఆ మాటలు విని లేచి అక్కడి నుంచి వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ వివరించింది. అయితే మీ టూ ఉద్యమంలో మాత్రం నేను లేనట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.