Pawan Kalyan : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు పవన్ కళ్యాణ్. అలాంటి ఆయన సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించారట. ఏంటి షాక్ అవుతున్నారా.. అవును ఇది నిజం. తన జీవితంలో విజయం చూడని పవన్ కళ్యాణ్ నేడు చరిత్ర సృష్టించి ఎన్నో కోట్ల మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొణిదెల వారి కుటుంబంలో చివరి వాడిగా 1971 సెప్టెంబర్ 2 న జన్మించాడు పవన్ కళ్యాణ్. తనకు తోడ ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు ఉన్నా కూడా కళ్యాణ్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. చదువు సరిగా ఒంటపట్డలేదు. తన 17 ఏళ్ల వయస్సులో పవన్ కళ్యాణ్ బాబు మొదటిసారి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.. “నాకు ఉబ్బసం వ్యాధి ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఒంటరిగా ఫీలయ్యేవాణ్ణి. నేను సోషల్ పర్సన్ ని కాను. 17 ఏళ్ల వయసులో, పరీక్షల ఒత్తిడి కారణంగా చాలా డిప్రెషన్ కు గురయ్యాను. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య లైసెన్స్డ్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను… కానీ, అది గమనించిన మా వదిన సురేఖ, అన్నయ్య నాగబాబు నన్ను రక్షించారు. ఈ విషయం పెద్దన్నయ్య చిరంజీవికి చెప్పారు. ఆయన నన్ను కూర్చోపెట్టి.. ఇలాంటి పనులు చేయకు నా కోసం బ్రతుకు నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు కానీ, బ్రతికి ఉండు చాలని చెప్పాడు. అప్పటి నుండి నేను పుస్తకాలు చదువుతూ నా ఒత్తిడిని తగ్గించుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.
అలాంటి మనిషి నేడు ప్రజా సేవకు అంకితమయ్యాడు. తన సిగ్గు, బిడియం, భయాన్ని పక్కన పెట్టి ప్రజల మధ్యకు వచ్చాడు. కొన్ని కోట్ల మంది అభిమానం సంపాదించుకున్న హీరో రోడ్లపై చెప్పులు లేకుండా నడిచాడు. తల్లిని, భార్యను అనరాని మాటలు అని.. ఎన్నో అవమానాలు చేసినా కూడా భరించి ప్రజల కోసం నిలబడ్డాడు. పది సంవత్సరాలు శ్రమించి ఈరోజు ఇలా నిలబడ్డాడు. సినిమాలు, కుటుంబం, అభిమానులను వదిలేసి.. లగ్జరీ లైఫ్ ను త్యాగం చేసి ప్రజల సమస్యలే తన సమస్యలుగా పోరాడుతూ ముందుకు సాగుతున్నారు జనసేనాని.