Adha Sharma : సూసైడ్ చేసుకున్న హీరో ఫ్లాట్ లో ఆదా శర్మ.. ఆ సమయంలో అక్కడేం చేస్తుంది

- Advertisement -

Adha Sharma : స్టార్ హీరోయిన్ అదా శర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకు టాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఓ దివంగత నటుడు ఫ్లాట్లో ఉంటుందని తెలియ‌డంతో అంతా అవక్కావుతున్నారు. అత‌నెవ‌రో కాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. పేరు చెప్పగానే చాలామంది చాలా ఎమోషనల్ గా ఫీలైపోతుంటారు. కారణం కెరీర్లో ఉన్నత స్థానంలో ఎదుగుతుండగా అతి చిన్న వయసులోనే త‌న ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని అభిమానులకు బాధను మిగిల్చాడు.

బాలీవుడ్ లో నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడంటూ మొదట్లో నెటింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఫ్లాట్‌లో న‌టి ఆదాశర్మ మక్కాం పెట్టిందంటూ వార్తలు వస్తున్నాయి. దాదాపు నాలుగు నెలల నుంచి తాను సుశాంత్ ఫ్లాట్లోనే ఉంటుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఆదాశర్మ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ సుశాంత్ ఫ్లాట్‌లోనే ఉండడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ఎన్నో ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది. నేను నాలుగు నెలల క్రితం ఈ ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాన‌ని.. నా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో సరిగ్గా సదురుకోవడం కుదరలేదంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇటీవల ఆమెకు సంబంధించిన మొత్తం వస్తువులు, సామాన్లు అన్నీ ఫ్లాట్లో సర్దేసుకున్నా.. ఇక్కడ ఉంటే ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్లు తెలిపింది. కేరళ, ముంబై లో మా ఇంటి చుట్టు చెట్లు ఉంటాయి. ఆహ్లాదంగా ఉంటుంది. అదే చుట్టూ పచ్చని వాతావరణం ఈ ఫ్లాట్ కు కూడా ఉండడంతో ఇక్కడకు నేను షిఫ్ట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. అలానే ఈ ఫ్లాట్‌లోకి వేరే ఏం ఆలోచించకుండా దిగిపోయానని అదాశర్మ తెలిపింది. ప్రస్తుతం అదాశర్మ చేసిన కామెంట్స్‌ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here