Sruthi Hasan : స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు కొద్ది కాలం నుంచి శాంతన్ డూడుల్‌లో ప్రేమలో మునిగి తేలుతుంది. కానీ ఇటీవల మనస్పర్థలు రావడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని సింగల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్-2లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. తాను కొద్ది కాలంగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పీసీఓఎస్ అనే సమస్యతో బాధపడుతున్నాను. మొదటి పీరియడ్ నుంచే ఆ సమస్యతో పోరాడుతున్నాను. ఆ బాధను నేను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నాను. బ్యాడ్ పీరియడ్స్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఆ కారణంగా చాలా విషయాలను కోల్పోవాల్సి వచ్చింది. కోట్ల రూపాయలతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు నాకు పీరియడ్ సమస్య ఉందని చెప్పి మరో రోజు షూట్ పెట్టుకోమని చెప్పలేక బాధ భరించి చిత్రాల్లో నటిస్తున్నాను.
పాటలకు డ్యాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నాను. వాస్తవానికి ఈ ప్రాబ్లమ్ చాలా మంది మహిళల్లో తలెత్తుతుంది. పీసీఓఎస్ ఉన్న మహిళలకు పిల్లలు కూడా పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయంటారు. అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం అంటే శృతి హాసన్‌కు పెళ్లైన పిల్లలు పుట్టే అవకాశం లేదా? అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.