Balakrishna : మరోసారి బుక్ అయిన బాలయ్యా.. అంజలిని పబ్లిక్‌గా అక్కడ టచ్ చేశాడు

- Advertisement -

Balakrishna : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు బాలయ్య. తెలిసో తెలియకనో చేసిన చిన్న పొరపాటు కారణంగా ప్రస్తుతం బాగా ట్రోల్ అవుతున్నారు బాలయ్య బాబు. ఇటీవల ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన రచ్చ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. రోజు రోజుకు ఈ ఘటనపై కామెంట్స్ వినిపిస్తూ.. ట్రోలింగ్‌ హ్యూజ్ రేంజ్ లో జరుగుతుంది. ఆయన స్టేజ్ పై హీరోయిన్ అంజలిని తోసివేయడం.. కానీ దానిని హీరోయిన్ నవ్వుతూ కవర్ చేయడం అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో బాలకృష్ణపై పలువురు మండిపడుతున్నారు. అయితే ఇది సరదాగా మాత్రమే జరిగిందని హీరో విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిర్మాత నాగవంశీ చెప్పినా.. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అంజలి కూడా ఇది సరదానే జరిగింది. బాలయ్యకు తనకు ఎలాంటి వివాదం లేదని కవర్ చేసే ప్రయత్నం జరిగింది. అయినా ఈ వివాదం పై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈవెంట్‌లో బాలకృష్ణ ఫుల్‌గా మందుకొట్టారు. అందుకే హీరోయిన్‌తో అలా బిహేవ్ చేశారంటూ నెగిటివ్‌గా ప్రచారం బాగా జరుగుతోంది.

- Advertisement -

ఈ క్రమంలోనే మరో వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ ఈవెంట్ కు సంబంధించి బాలయ్య మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు. అంజలి తన ప్లేస్‌లో సోఫాలో కూర్చొనే క్రమంలో, బాలకృష్ణ అంజలిని తన లెఫ్ట్ హ్యాండ్‌తో ఆమె వెనుక భాగంలో టచ్ చేశాడు. ఆ సమయంలో అంజలి కూడా స్మైల్ ఇస్తూనే లేచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌ అయింది. ఇక ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్‌కు వచ్చి వివాదంలో చిక్కుకున్నావా బాలయ్య బాబు అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here