Pushpa 2 : అడ్డంగా దొరికిపోయిన దేవి శ్రీ ప్రసాద్.. ‘సూసేటి అగ్గి రవ్వ’ సాంగ్ అక్కడి నుంచి కాపీ కొట్టాడా

- Advertisement -

Pushpa 2 : లెక్కల మాస్టారు సుకుమార్ సెన్సేషనల్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఎంతటి సంచలనంగా మారిందో చెప్పక్కర్లేదు. ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌కి ఆడియన్స్‌ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సాంగులో హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా కపుల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది పుష్ప 2 మేకర్స్.

ఈ పాటను సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ చేస్తున్నారు ఆకతాయిలు. ముఖ్యంగా ఓ పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే దాంట్లో లొసుగులు ఏమున్నాయో వెతికే పనిలో ఉంటారు ట్రోలర్స్. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ని ? మ్యూజిక్ డైరెక్టర్ని..? హీరోని ..? హీరోయిన్ ని ట్రోల్స్ కు గురి చేస్తూనే ఉంటారు. పుష్ప2లోని.. సూసేకి అగ్గి రవ్వ మాదిరి అనే కపుల్ సాంగ్ హ్యూజ్ ట్రోలింగ్ కు గురవుతుంది. ఈ సాంగు లిరిక్స్ వినేందుకు అర్థవంతంగా ఉంటూ హైలెట్ అయ్యాయి.

- Advertisement -

అయితే ఇక్కడ ఇప్పుడు ఆ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ పాట తెలంగాణ ఫోక్ సాంగ్ ను మక్కీ కి మక్కీ దింపేసినట్లు ఉన్నాడు అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించిన ట్రోలింగే ఎక్కువగా జరుగుతోంది. మరి దీనిపై పుష్ప 2 టీం ఈ ట్రోలింగ్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here