KCR Movie : ‘కేసీఆర్’ సినిమా నుంచి తెలంగాణ తేజం సాంగ్.. అదరహో అనిపించిన గోరేటి సాహిత్యం

- Advertisement -

KCR Movie : జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వెండితెరపై హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. చాలామంది కెరీర్ లో దాదాపు స్థిరపడ్డారు. అందులో రాకింగ్ రాకేష్‌ ఒకడు. చిన్న కంటెస్టెంట్‌గా ఈ షోలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో జబర్దస్త్‌ టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. ఇప్పుడు చాలా మంది జబర్దస్త్‌ కమెడియన్లలాగే బిగ్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమా తెరకెక్కిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా, నిర్మాతగా మారి ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదుగా ఇటీవల కేసీఆర్‌ సినిమా లాంఛ్‌ అయింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో రాకేష్ సరసన అనన్య హీరోయిన్‌గా చేస్తున్నారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, రచ్చరవి, జోర్ధార్ సుజాత, తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రానికి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా పని చేస్తున్నారు. బలగం మధు ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి బత్తుల మహేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు.

- Advertisement -

గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో.. విభూది క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన తెలంగాణ తేజం అనే పాటను విడుదల చేశారు. పదగతులు స్వరజతులు పల్లవించిన నేల.. తేనె తీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద దరువుల నేల.. అంటూ ఈ పాట సాగుతుంది. ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న ఈ పాటకి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. గోరేటి వెంకన్న, సింగర్ మనో, కల్పన ఈ పాటని అత్యద్భుతంగా ఆలపించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here