Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అమీషా పటేల్ కూడా ఒకరు. పవన కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. ఇక తెలుగులో చాలా తక్కువ సినిమాలే తీసినప్పటికీ ఈ అమ్మడు అందాలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతేడాది ‘గదర్ 2’తో అమిషా అలరించింది. ప్రస్తుతం ‘తౌబా తేరా జల్వా’ మూవీతో బిజీగా ఉంది.
ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడు యాక్టివ్‌గా ఉంటూ అందాలతో రచ్చ చేస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బద్రి, మహేష్ తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, బాలకృష్ణతో పరమవీరచక్ర వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో కంటే ఈమెకు హిందీలో ఎక్కువ సినిమాలు హిట్ అవ్వడంతో బాలీవుడ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే 48 ఏళ్ల వయసున్న అమీషా పటేల్ ఇప్పటివరకు పెళ్లికి దూరంగానే ఉంది.
అయినా ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ స్కిన్ షో చేస్తుంది. ఈ మేరకు తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టా వేదికగా ‘సమ్మర్ టైం’ అనే క్యాప్షన్ తో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వయసులో ఇంత అందం ఎలా మెయింటెన్ చేస్తున్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అమీషా పటేల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.