Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తర్వాత ఆలిండియా లెవల్లో పేరుపొందారు హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నారు ప్రభాస్. క్షణం తీరిక లేకుండా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2829 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్, అలాగే విశ్వ నటుడు కమలహాసన్ కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంత పెద్ద స్టారో హీరో అయిన ప్రభాస్ ఎల్లప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. తన సంపాదనలో చాలా భాగం దానధర్మాలకు కేటాయిస్తూనే ఉంటాడు. ఇది వరకు మహమ్మారి వ్యాప్తించిన సమయంలో కూడా ప్రభాస్ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఏకంగా రూ.35 లక్షల విరాళం ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇక తన స్నేహితులకి, తన తోటి నటులకు, అలాగే ఎవరైనా అతిథులు వస్తే చాలు ప్రభాస్ వారికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారన్న విషయం ఎంతోమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చెప్పిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఇటీవల కాలంలో చనిపోయాడు. అతడి మరణ వార్త తెలుసుకున్న ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వెంటనే వారి కుటుంబ సభ్యులకి ఆర్థికంగా సాయం అందించమని ప్రభాస్ తన పీఏ రామకృష్ణను శనివారం నాడు రమేష్ కుటుంబ సభ్యుల వద్దకు పంపించాడు. అంతేకాకుండా అతని పేరిట కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ చేసిన సాయంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.