Anchor Pradeep : మనం జీవితంలో ఏదో అవ్వాలి అనుకుంటాం.. ఏదో సాధించాలని ఆశపడతాం. చివరకు మనం ఊహించనిది ఏదో అవుతాం. చాలామంది వాళ్లు ఊహించిన లక్ష్యాలను సాధించకుండానే లైఫ్ లో మూవ్ ఆన్ అవుతుంటారు. కాగా యాంకర్ ప్రదీప్ కూడా అలాంటి వారి జాబితాలోకే వస్తాడు. హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ హీరో కాలేకపోయాడు. యాంకరింగ్ తో మాత్రమే సరిపెట్టుకుని కానిచ్చేస్తున్నాడు. అయితే తన కోరికను చంపుకోలేక హీరోగా 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు.

ప్రదీప్ కి స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అదిరిపోయే పంచులతో, కామెడీ టైమింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఓ క్రేజీ గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం అతని యాంకరింగ్ కోసమే షోలను చూసే వాళ్లు కూడా ఉన్నారు. దీంతో ప్రస్తుతం పలు టీవీ షోలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రదీప్ యాంకర్ గా మారక ముందు ఏం చేసేవాడన్న విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రదీప్ యాంకర్ కాకముందు ఒక డ్యాన్సర్ అనే విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రదీప్ ఎక్సలెంట్‌గా డ్యాన్స్ చేస్తాడు .
మళ్లీ ఎన్నడూ ఢీ షో లో ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. కానీ ఆయనలో ఓ మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. డ్యాన్సర్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు ప్రదీప్. డ్యాన్స్ ద్వారా మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ప్రదీప్ ఓ షోలో పార్టిసిపెంట్ గా చేసి సరిగ్గా డ్యాన్స్ చేయక జడ్జిలతో నెగిటివ్ కామెంట్స్ తీసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ వీడియో చూడగానే ప్రదీప్ అభిమానులు షాక్ అయ్యారు. నువ్వు డ్యాన్సర్ వా? నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రదీప్ మల్టీ టాలెంటెడ్ రా బాబు అంటూ పోగిడేస్తున్నారు.