Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత అగ్రహీరోలతో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. ఇటీవల కాలంలో సమంతకు సంబంధించిన ఏ చిన్న వార్త కూడా జెట్ స్పీడ్ లా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత … నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సమంతకు సంబంధించిన మరో వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత టాలీవుడ్‌లో కాకుండా బాలీవుడ్‌పై సమంత ఫోకస్ పెట్టింది.

తెలుగు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు సమంతకు లవ్ ప్రపోజ్ చేశాడట. గత కొంత కాలంగా ఆమెపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న ఆ హీరో కొడుకు.. ‘ఐ లవ్ యూ’ అంటూ ఆమె వెనుక పడుతున్నాడట. అయితే మొదటి సారి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండి రెండోసారి ఆ తప్పు చేయకూడదని ఆలోచిస్తుందట. కానీ ఆ హీరో కొడుకు ఐ లవ్ యూ…ఐ లవ్ యూ…ఐ లవ్ యూ అంటూ ఆమెను టార్చర్ పెడుతున్నాడు. గతంలో పలువురు జ్యోతిష్యులు వచ్చి సమంత జాతకంలో రెండో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటూ చెప్పారట. ఇప్పుడు ఈ హీరో కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి సమంత మరో ఆన్సర్ చెప్పబోతోంది. సమంత రెండో పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.