Janvi Kapoor : ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు జాన్వీ కపూర్ పై పీకల్లోతు కోపంలో ఉన్నారా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. ఇంతకీ వాళ్లు అంత కోసం తెప్పించే పని ఏం చేసిందో చాలామందికి అర్థం కావడం లేదు. కానీ కొందరు మాత్రం అందుకు కారణం అల్లు అర్జునే అంటున్నారు. అసలు మేటర్ లోకి వెళితే.. జాన్వీ కపూర్ తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ.. జాన్వీ కపూర్ చేసిన పని మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో అమ్మడిని ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. జాన్వీ కపూర్ చేసిన పని ఇప్పుడు ఆమె కెరియర్ ను డిజాస్టర్ గా మార్చే క్రమంలో పడిపోయేలా చేసింది అంటున్నారు జనాలు..
జాన్వీ కపూర్.. తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా దేవర. అయితే ఈ దేవర సినిమా నుంచి లేటెస్ట్ గా ఫియర్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం ఫియర్ సాంగ్ రిలీజ్ చేసింది .
ఈ సాంగ్ ని పట్టించుకోకుండా జాన్వీ కపూర్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సాంగ్ కు లైక్ కొట్టింది. అంతే దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. మీ సినిమాను కాదని పుష్ప2 సినిమాను లైక్ చేస్తావా..?.. పుష్ప2ని లైక్ చేయి తప్పులేదు ..మరి నీ సినిమా పాట గురించి నువ్వు ప్రమోట్ చేసుకోవా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ అభిమాన హీరో ఎన్టీఆర్ కు ఘోర అవమానం అంటూ జాన్వీ కపూర్ ని బూతులు తిడుతున్నారు