Rajamouli : రాజమౌళి తన సినిమాలో చేయమని ఎంతగా రిక్వెస్ట్ చేసిన ససేమీరా ఒప్పుకోని హీరోయిన్

- Advertisement -

Rajamouli : ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా రాజమౌళి అంటే ఎంతటి క్రేజ్ ఉన్న డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా ఏ నటీనటులను తన సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేయరు. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అంత టాప్ మోస్ట్ డైరెక్టర్.. ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు. అలాంటి రాజమౌళి ఓ హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడన్న వార్త నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల బుట్టబొమ్మ అలియా భట్. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ తో ఆల్రెడీ నటించేశారు. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య కొన్ని క్లాషెస్ కూడా వచ్చాయంటూ ప్రచారం జరిగింది. రాజమౌళి ఎడిటింగ్ లో అలియా నటించిన చాలా సీన్స్ లేపేశారు అని ఆ కారణంగానే ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయినా కూడా తనకి క్రేజ్ దక్కలేదంటూ రాజమౌళి పై అలియా భట్ ఆగ్రహంగా ఉందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత అలాంటిది ఏదీ లేదంటూ అలియాభట్ క్లారిటీ ఇచ్చింది. అయినా జనాలు మాత్రం నమ్మడం లేదు.

- Advertisement -

అయితే దానిని కన్ఫామ్ చేస్తూ ఇప్పుడు రాజమౌళి సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా తీసుకునేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు తో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ఆలియా భట్ ని కలిశారట. అయితే ఆలియా భట్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేసిందట . కానీ రాజమౌళి మాత్రం ఈ పాత్రకు అలియానే నే బాగుంటుందంటూ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ ఆలియా ససేమీరా ఒప్పుకోవడం లేదట. ప్రజెంట్ ఇదే వార్త బాగా వైరల్ గా మారింది..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here