Anchor Sreemukhi : స్టార్ కమెడియన్‎తో రాములమ్మ పెళ్లి ఫిక్స్.. ఆయన ఎవరంటే ?

- Advertisement -

Anchor Sreemukhi : బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా పలు రకాల షోలతో ఫుల్ బిజీగా ఉంది. తన మాటలతో మాయ చేస్తూ.. పొట్టి పొట్టి బట్టల్లో అందాలను ఆరబోస్తూ అందరినీ మెప్పిస్తోంది. సోషల్ మీడియాలోనూ పలు రకాల వీడియోలు, పోస్టులు పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి చేసుబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ అమ్మడు స్పందించి పెళ్లిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.

తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది శ్రీముఖి. పటాస్ వంటి ప్రోగ్రామ్‌తో క్రేజ్‍‌ తెచ్చుకుంది. పలు షోలతో టాప్ యాంకర్‍‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4, 5 షోలు ఉన్నాయి. శ్రీముఖి వయసు మూడు పదులు ఎప్పుడో దాటిపోతుంది. ఆయినా అమ్మడి పెళ్లి ఊసే లేదు.. పెళ్లి ఎపుడా? అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ కమెడియన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని అనడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అదంతా నిజజీవితంలో కాదు. ఆదివారం విత్ స్టార్ మా షోలో భాగంగా ఫన్నీగా చెప్పింది. ఈ షోకు శ్రీలక్ష్మి, బాబు మోహన్, అన్నపూర్ణ హాజరయ్యారు. వెల్ కమ్ చెప్పిన తర్వాత నాకు అందరూ ఫ్యాన్స్. కానీ నేను మాత్రం శ్రీముఖి ఫ్యాన్ ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం అని అనడంతో ఆమె షాక్ అవుతుంది. ఆ తర్వాత వారు ఆహా నా పెళ్లంటా అనే సాంగ్‌కు డ్యాన్స్ చేశారు.

- Advertisement -

Sreemukhi White Saree Photos

అయితే శ్రీముఖి స్టేజ్‌పై కూర్చుని నాకెందుకు పెళ్లి జరగట్లేదని అంటుంది. ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ బాబు మోహన్ స్పందిస్తూ.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా కదా’’ అని కామెడీగా అంటాడు. దీంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా బాబు మోహన్‌తో శ్రీముఖి పెళ్లి ఫిక్స్? అంటూ సెటైరికల్ గా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here