Esha Rebba : ఎన్టీఆర్ తో నటిస్తే నాకు ఒరిగిందేమీ లేదు.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Esha Rebba : టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువగా ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికి కారణమేంటో మాత్రం ఎవ్వరికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో బోలెడంత మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. కానీ పెద్ద పెద్ద సినిమాలో మాత్రం పరాయి ఇండస్ట్రీకి చెందిన వాళ్లనే తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. కాగా ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ ఈషా రెబ్బా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పేరుకు తెలుగు అమ్మాయి కావడంతో సినిమాల్లో అరకొర ఛాన్సులతో నటించినా పెద్దగా పాపులారిటీ మాత్రం దక్కించుకోలేకపోయింది ఈషారెబ్బ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈషా రెబ్బ . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసినందుకు నేను హ్యాపీగా లేను అంటూ సంచలన ప్రకటన చేసింది . ఆమె మాట్లాడుతూ..‘‘మొదట ఈ సినిమాలో నన్ను చేయమన్నప్పుడు.. ఫస్ట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాల్లో ఇక నుంచి నేను లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సెకండ్ హీరోయిన్ అని చెప్పారు. అయినా నో అన్నాను. సెకండ్ లీడ్ అని చెప్పడంతోనే ఓకే అనేశాను. కరెక్ట్ గా సినిమా షూట్ మొదలయ్యే ఒక్క రోజు ముందు ఈ సినిమాకు అగ్రిమెంట్ పై సంతకం చేశాను.

- Advertisement -

అయితే సినిమాలో నా సీన్స్ చాలా వరకు ఎడిటింగ్ లో తీసేశారు. నాకు ఎన్టీఆర్ తో ఒక సాంగ్ ఉంటుందన్నారు.. అది క్యాన్సిల్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన తర్వాత చాలామంది నన్ను అడిగారు… నువ్వు ఎందుకు ఈ సినిమా చేశావు. నీది బిస్కెట్ క్యారెక్టర్ అయింది కదా అని .. వాళ్ళకి నేను ఏమి ఆన్సర్ ఇచ్చుకోలేకపోయాను. ఈ సినిమాలో నటించిన కారణంగా నాకున్న హ్యాపీనెస్ ఒక్కటే తారక్ – త్రివిక్రమ్ గార్లతో వర్క్ చేయడం .. అది తప్పిస్తే నాకు పెద్దగా ఒరిగింది ఏం లేదు. అయితే తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ.. అని జనాలకు అర్థమైంది.. అదొక్కటే అంటూ ఈషా రెబ్బ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here